US Recession: ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తున్న అమెరికా ప్రధాన సూచీలు.. ఇక దేవుడే దిక్కు..!!

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


US
Recession:

ఇప్పటికే
ప్రపంచ
వ్యాప్తంగా
దిగజారిన
ఆర్థిక
పరిస్థితులు,
అధిక
ద్రవ్యోల్బణం,
ఉద్యోగాల
కోత
వంటి
సమస్యలు
ప్రజలను
ఉక్కిరి
బిక్కిరి
చేస్తున్నాయి.
కరోనాతో
చిన్నాభిన్నమైన
జీవితాలు
కుదుటపడక
ముందే
మరో
బాంబు
లాంటి
వార్త
అందరికీ
కునుకు
లేకుండా
చేస్తోంది.

అవును
మళ్లీ
మాంద్యం
దిశగా
యూఎస్
పయనిస్తోందనే
చేదు
నిజం
బయటపడింది.
US
బిజినెస్
సైకిల్స్
ట్రాక్
చేయడానికి
రూపొందించబడిన
సూచిక
జూన్‌లో
వరుసగా
15వ
నెలలో
కూడా
పడిపోవటం
ఆందోళన
కలిగిస్తోంది.
బలహీనపడుతున్న
వినియోగదారుల
దృక్పథం,
పెరిగిన
నిరుద్యోగ
క్లెయిమ్‌ల
కారణంగా
2007-2009
వరకు
తగ్గుదల
మాంద్యాన్ని
సూచిస్తోందని
ఆర్థిక
నిపుణులు
వెల్లడించారు.
భవిష్యత్తు
ఆర్థిక
కార్యకలాపాను
అంచనా
వేసే
కొలత
జూన్‌లో
0.7%
క్షీణించి
106.1కి
పడిపోయింది.

ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తున్న అమెరికా ప్రధాన సూచీలు..

జూన్
డేటా
ప్రకారం
రానున్న
నెలల్లో
ఆర్థిక
కార్యకలాపాలు
మందగించడం
కొనసాగుతుందని
సూచిస్తున్నాయని
కాన్ఫరెన్స్
బోర్డ్‌లోని
సీనియర్
మేనేజర్
జస్టినా
జబిన్స్కా-లా
మోనికా
తెలిపారు.
ప్రస్తుత
మూడవ
త్రైమాసికం
నుంచి
2024
మొదటి
త్రైమాసికం
వరకు
US
ఆర్థిక
వ్యవస్థ
మాంద్యంలో
ఉండవచ్చని
కాన్ఫరెన్స్
బోర్డు
పునరుద్ఘాటించింది.
ఇదే
జరిగితే
ఇప్పటికే
అధ్వానంగా
తయారైన
పరిస్థితులు
మరింతగా
దిగజారతాయని
ఆందోళనలు
వెల్లువెత్తుతున్నాయి.

విపరీతంగా
పెరిగిన
ధరలు,
కఠినమైన
ద్రవ్య
విధానం,
కష్టతరమైన
క్రెడిట్,
ప్రభుత్వ
వ్యయం
తగ్గుదల
వంటివి
ఆర్థిక
వృద్ధిని
మరింత
తగ్గించడానికి
సిద్ధంగా
ఉన్నాయని
జబిన్స్కా-లా
మోనికా
పేర్కొన్నారు.
అలాగే
జూన్-డిసెంబర్
2022
మధ్య
కాలంలోని
3.8%తో
పోలిస్తే
LEIలో
సంకోచం
గత
ఆరు
నెలల్లో
4.2%
పడిపోయిందని
కాన్ఫరెన్స్
బోర్డు
తెలిపింది.

మెుత్తానికి
అమెరికా
మాంద్యంలోకి
జారుకుంటుందనే
భయాలు
ఆసియా
అంతటా
వ్యాపించాయి.
పరిస్థితులు
చక్కబడతాయని
రోజులు
గడుపుతున్న
సామాన్యులకు
మరో
సుదీర్ఘ
ప్రయాణం
తప్పదని
తెలుస్తోంది.
అంటే
వడ్డీ
రేట్లు
కూడా
ఇప్పట్లో
తగ్గే
అవకాశమే
లేదని
నిపుణులు
నొక్కి
చెబుతున్నారు.

English summary

Key indicators in US Business cycle warning about recession soon in america, fears rising

Key indicators in US Business cycle warning about recession soon in america, fears rising

Story first published: Friday, July 21, 2023, 20:18 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *