[ad_1]
దిశ, ప్రదేశం
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో తులసిని ఎక్కడ ఉంచాలనేది కూడా శాస్త్రం చెబుతుంది. తులసి మొక్కను సరైన దిశలో పెడితే ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్కను నాటడంతో పాటు దాన్ని ఏ దిశలో ఉంచాలనేది కూడా ముఖ్యమే.. అదే విధంగా సరైన రోజున నాటడం మంచిది. తులసిని ఉంచే దిశ, ప్రదేశం ముఖ్యమైంది. తులసిని తప్పుడు స్థానంలో ఉంచితే మంచితే మంచిది కాదట.
పాజిటివ్ ఎనర్జీ
తులసి మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసిని ఇంటి పైకప్పు మీద పెట్టకూడదని చెబుతారు. ఇంటి పైకప్పుపై తులసిని ఉంచడం వల్ల దురదృష్టం వెంటాడుతుందట. వాస్తు శాస్త్రం ప్రకారం, తలుపు వద్ద తులసి మొక్కను పెట్టడం శుభంగా భావిస్తారు. ఎందుకంటే, దీనిని పూజించి ఇంటి బయట ఉంచడం, వస్తూ పోతూ అందరి చూపు దాని మీద పడడం మంచదట.
ఉత్తర దిశలో
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణిస్తారు. తులసిని ఉత్తర దిశలో ఉంచుకోవాలి. ఉత్తర దిశలో ఉంచడం సాధ్యం కాకపోతే, మీరు ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచుకోవచ్చు. అలాగే తులసి మొక్కను బాల్కనీలో లేదా కిటికీకి సమీపంలో ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచవచ్చు.
[ad_2]
Source link
Leave a Reply