vedanta: అయిదోసారి మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన వేదాంత.. ఈసారి ఎంత చెల్లించనుందంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

vedanta: ఇన్వెస్టర్లకు వేదాంత గ్రూపు శుభవార్త చెప్పింది. FY23కి గాను తన వాటాదారులకు ఐదవ మధ్యంతర డివిడెండ్ చెల్లింపును బోర్డు ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.20.50 చెల్లించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం దాదాపు రూ.7,621 కోట్లను ఖర్చు చేయనుంది. డివిడెండ్‌కు కంపెనీ ఆమోదం తెలిపే ముందు షేరు 1.50 శాతం లాభంతో కొనసాగుతోంది. అయితే గతేడాదిగా స్టాక్ ద్వారా రాబడి దాదాపు 33 శాతం పడిపోగా, YTD పనితీరు 12.84 శాతం తగ్గడం గమనార్హం.

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను పేస్ వాల్యూ రూ.1 పై 2,050 శాతాన్ని (రూ.20.50) మధ్యంతర డివిడెండ్ ఆమోదించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వేదాంత తెలిపింది. ఇందుకు రికార్డు తేదీని ఏప్రిల్ 7 గా నిర్ణయించినట్లు చెప్పింది. అయితే సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అజయ్ గోయెల్ తన పదవికి రాజీనామా చేశారని ప్రకటించింది. అది ఏప్రిల్ 9, 2023 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.

vedanta: అయిదోసారి మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన వేదాంత..

గత ఏడాది కాలంగా రూ.81 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఫలితంగా ఈ స్టాక్ నుంచి దాదాపు 30 శాతం భారీ డివిడెండ్ రాబడి వచ్చినట్లయింది. అయితే రుణ మెచ్యూరిటీలు సమీపిస్తుండగా, వేదాంత రిసోర్సెస్ చెల్లింపు సామర్థ్యంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో డివిడెండ్ ప్రకటించి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కలిగించక మానదు. వేదాంత లిమిటెడ్‌లో అనిల్ అగర్వాల్‌కి చెందిన వేదాంత రిసోర్సెస్‌కు 70 శాతం వాటా ఉంది.

డిసెంబరు త్రైమాసికంలో వేదాంత ఏకీకృత నికర లాభం 42 శాతానికి అంటే రూ.3,092 కోట్లకు పడిపోయింది. నిర్వహణ ఆదాయాన్ని రూ.33,691 కోట్లుగా కంపెనీ నివేదించింది. ఆ సమయానికి సంస్థ వద్ద రూ.23,474 కోట్లు విలువైన నగదు ఉంది. మే 2022లో మొదటి మధ్యంతర డివిడెండ్‌ రూ.31.50, రెండవ మధ్యంతర నగదు డివిడెండ్‌ రూ.19.50ని జూలైలో జారీ చేసింది. గతేడాది నవంబర్, ఫిబ్రవరి 2023లో ప్రకటించిన మూడవ, నాల్గవ ఈక్విటీ డివిడెండ్‌లు ఒక్కో షేరుకు రూ.17.50 మరియు రూ.12.50 చొప్పున చెల్లించింది.

English summary

Vedanta board announced 5th interim dividend of 20.50

Vedanta interim dividend

Story first published: Wednesday, March 29, 2023, 8:20 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *