Volatile Markets: ఊగిసలాటల్లో స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో నిలవలేక నష్టాలు..!!

[ad_1]

మార్కెట్ సూచీలు..

మార్కెట్ సూచీలు..

ఈరోజు ఉదయం 11.10 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 18 పాయింట్ల నష్టాల్లో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 5 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ 155 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 105 పాయింట్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ఆప్షన్స్ ఎక్స్ పైరీ కూడా కావటంతో మార్కెట్లు అనిశ్చితిలో కొనసాగుతున్నాయి.

ఫెడ్ నిర్ణయం..

ఫెడ్ నిర్ణయం..

US ఫెడ్ మినిట్స్ సమాచారం బయటకు వచ్చింది. అందులోని వివరాల ప్రకారం అమెరికాలో ద్రవ్యోల్బణం ఫెడ్ లక్ష్యం అయిన 2 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ఆ సమయంలో ఫెడ్ సభ్యులు 25 బేసిస్ పాయింట్ల మేర రేటును పెంచేందుకు మద్దతునిచ్చారని వెల్లడైంది. ఈ చర్య ఫెడ్ ఫండ్స్ రేటును 4.5%-4.75% లక్ష్య శ్రేణికి తీసుకువచ్చింది. ఈ సమాచారంతో అమెరికా మార్కెట్లు వరుసగా నాలుగు రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆ ప్రభాయవం భారత మార్కెట్లపై కూడా కనిపిస్తోంది.

టాప్ గెయనర్స్..

టాప్ గెయనర్స్..

ఈ క్రమంలో ఐటీసీ, కోల్ ఇండియా, యూపీఎల్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్, హిందాల్కొ, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, ఎస్బీఐ, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..

టాప్ లూజర్స్..

ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, హెచ్డీఎఫ్యీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, దివీస్ ల్యాబ్స్, బ్రిటానియా, ఎల్ అండ్ టి, బజాజా ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటార్స్, టాటా కన్జూమర్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *