Watermelon Seeds: పుచ్చకాయ గింజలు పారేస్తున్నారా..? వీటి ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు..!

[ad_1]

Watermelon Seeds: వేసవికాలం మొదలైంది.. సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మండే ఎండల నుంచి రిలీఫ్‌ ఇవ్వడానికి పుచ్చకాయను మించిన పండు ఉండదు. పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఈ జ్యూసీ.. జ్యూసీ ఫ్రూట్‌లో మన శరీరానికి అవసరమైన విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. మనం పుచ్చకాయ తినేప్పుడు.. గంజలను గింజలను పక్కన పడేస్తుంటారు. పుచ్చకాయ ఉన్న పోషక విలువల్లో ఎక్కువ భాగం దాని గింజల నుంచే లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ గింజల్లో.. ప్రొటీన్లు, విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, కాపర్‌, జింక్‌, మాంగనీస్‌, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఈ స్టోరీలో చూద్దాం.

ఎముకలు స్ట్రాంగ్‌ అవుతాయ్..

ఎముకలు స్ట్రాంగ్‌ అవుతాయ్..

పుచ్చకాయ గింజల్లో కాపర్‌, మాంగనీస్, పొటాషియం వంటి మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఈ సూక్ష్మపోషకాలు.. ఎముకలను దృఢంగా మార్చడానికి సహాయపడతాయి. పుచ్చకాయ గింజలు.. ఎముకలను స్ట్రాంగ్‌ చేయడంతో పాటు ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి. పుచ్చకాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆస్టియోపొరోసిస్ సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. కండరాలను దృఢంగా మార్చుతాయి. (image source – pixabay)

జీవక్రియను మెరుగుపరుస్తాయి..

జీవక్రియను మెరుగుపరుస్తాయి..

పుచ్చకాయ గింజలు ఫోలేట్, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాల పవర్‌హౌస్. అమైనో యాసిడ్స్‌, ప్రొటీన్లు, విటమిన్ బి కాంప్లెక్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషఖాలు మీ శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తాయి. (image source – pixabay)

షుగర్‌ పేషెంట్స్‌కు మంచిది..

షుగర్‌ పేషెంట్స్‌కు మంచిది..

పుచ్చకాయ గింజలు డయాబెటిక్స్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి తోడ్పడతాయి. ఇవి ఎలివేటెడ్ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. పుచ్చకాయ గింజల్లో విటమిన్లు- ఎ, సి, బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయుల్లోని హెచ్చుతగ్గులను నియంత్రిస్తాయి. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను ఎఫెక్ట్‌ చేసే కార్బొహైడ్రేట్లను క్రమబద్ధీకరించడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. షుగర్‌ పేషెంట్స్‌ ఇవి బెస్ట్‌ స్కాక్‌ ఆప్షన్‌.

Also Read: ఈ ఐదు పనులు మానేస్తే.. 15 రోజుల్లో షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

గుండెకు మేలు చేస్తాయి..

గుండెకు మేలు చేస్తాయి..

పుచ్చకాయ గింజల్లో మోనో అన్‌శ్యాచురేటెడ్, పాలీ అన్‌శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆహారంలో చేర్చుకుంటే.. గుండెపోటు, గుండె సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. (image source – pixabay)

బ్రెయిన్‌ షార్ప్‌ అవుతుంది..

బ్రెయిన్‌ షార్ప్‌ అవుతుంది..

పుచ్చకాయ గింజల్లోని విటమిన్‌-బి, ఐరన్, ఇతర ఖనిజ లవణాలు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తిని పెంచడంలో.. ఈ గింజల్లోని ఫోలిక్‌ యాసిడ్‌ బాగా పనిచేస్తుంది.పుచ్చకాయ గింజల్లో విటమిన్‌ బి సమృద్ధిగా ఉంటుంది. ఇది మెదడు, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మూడ్ డిజార్డర్స్, డిమెన్షియాలోనూ సహాయపడుతుంది. పుచ్చకాయ గింజలను పొడిగా చేసుకుని వివిధ రకాల ఫ్రూట్‌ సలాడ్స్‌, సూప్స్‌, స్మూతీలలో కలుపుకొని తీసుకోవచ్చు. వీటిని వేయించుకుని కూడా తీసుకోవచ్చు. (image source – pexels)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *