[ad_1]
6.5% నుంచి 6.9%కి
ప్రపంచ బ్యాంక్ భారతదేశ వృద్ధి అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.5% నుంచి 6.9%కి పెంచింది. బ్యాంక్ వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనాలను అంతకుముందు 7% నుంచి 6.6%కి తగ్గించింది. భారత్… సహచర దేశాల వలె, వస్తువుల ధరల పెరుగుదల. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వల్ల ఇబ్బంది పడిందని వివరించింది.
భారత్‌పై చాలా తక్కువ ప్రభావం
ఇతర వర్ధమాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, ప్రపంచ మందగమనం భారత్‌పై చాలా తక్కువ ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంకు భావిస్తోంది. “ఈ దశలో భారత్ రుణ స్థిరత్వం గురించి మాకు ఎటువంటి ఆందోళన లేదు” అని ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త ధృవ్ శర్మ చెప్పారు. ప్రజా రుణం తగ్గింది. నివేదిక ఈ ఏడాది సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 7.1% వద్ద ఉందని, వస్తువుల ధరల పతనం ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించవచ్చని చెప్పారు..
రిటైల్ ద్రవ్యోల్బణం
భారతదేశ వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో మూడు నెలల కనిష్ట స్థాయి 6.77%కి తగ్గింది. అయితే కొంతమంది ఆర్థికవేత్తలు ఈ రేటు 4%కి తగ్గడానికి రెండు సంవత్సరాల వరకు పట్టవచ్చని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించడం భారతీయ రిజర్వ్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా వడ్డీ రెట్లు పెంచుతూ పొతోంది.
రెపో రేటు
తాజాగా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమావేశం కొనసాగుతోంది. రుణా రెపో రేట్ పెంపుపై ఆర్బీఐ బుధవారం ప్రకటన
చేయనుంది. అయితే ఇదే చివరి పెంపు అని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. కాగా ఈ సారి రెపో రేటు 25-35 bps పెంచే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
[ad_2]
Source link
Leave a Reply