WPI Inflation: బిగ్ రిలీఫ్.. జూన్‌లో భారీగా తగ్గిన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

WPI
Inflation:
చాలా
కాలం
ఆర్థిక
వ్యవస్థను
వేధించిన
ద్రవ్యోల్బణం
నెమ్మదినెమ్మదిగా
అదుపులోకి
వస్తోంది.
అంతర్జాతీయంగా
కూడా
ఇవే
పరిణామాలు
కనిపిస్తున్నాయి.

తాజాగా
జూన్‌
టోకు
ద్రవ్యోల్బణం
డేటాను
భారత
ప్రభుత్వం
శుక్రవారం
విడుదల
చేసింది.
హోల్‌సేల్
ద్రవ్యోల్బణం
జూన్
2023లో
(-)4.12
శాతానికి
తగ్గింది.
దీనికి
ముందు
మే
2023లో
టోకు
ద్రవ్యోల్బణం
రేటు
(-)3.48
శాతంగా
నమోదైంది.
నవంబర్
2015
తర్వాత
జూన్
మాసంలో
కనిష్ఠ
స్థాయికి
ద్రవ్యోల్బణం
చేరుకుంది.
టోకు
ద్రవ్యోల్బణం
రేటులో
0.40
శాతం
క్షీణతను
నమోదు
చేసింది.

WPI Inflation: బిగ్ రిలీఫ్.. జూన్‌లో భారీగా తగ్గిన హోల్‌సేల్

వరుసగా
మూడో
నెల
సైతం
టోకు
ద్రవ్యోల్బణం
తగ్గుదలను
నమోదు
చేసింది.
దీనికి
ముందు
ఏప్రిల్,
మే
నెలల్లో
టోకు
ద్రవ్యోల్బణం
ప్రతికూలంగా
ఉంది.
జూన్‌లో
రిటైల్
ద్రవ్యోల్బణం
4.81
శాతానికి
పెరిగిన
సంగతి
తెలిసిందే.
టోకు
ద్రవ్యోల్బణం
తగ్గడానికి
మినరల్
ఆయిల్,
ఫుడ్
ప్రొడక్ట్స్,
బేసిక్
మెటల్స్,
క్రూడ్
పెట్రోలియం,
నేచురల్
గ్యాస్
అండ్
టెక్స్‌టైల్స్
ప్రధాన
కారణంగా
నిలిచాయని
ప్రభుత్వం
తన
ప్రకటనలో
పేర్కొంది.
గడచిన
నెలలో
వీటి
ధరలు
తగ్గుముఖం
పట్టాయి.

ప్రభుత్వ
గణాంకాల
ప్రకారం
ఆహార
వస్తువుల
ద్రవ్యోల్బణం
జూన్‌లో
1.24
శాతం
తగ్గింది.
మేలో
ప్రతికూల
వృద్ధి
1.59
శాతంగా
ఉంది.
ఇంధనం,
విద్యుత్
విభాగంలో
ద్రవ్యోల్బణం
జూన్‌లో
12.63
శాతానికి
తగ్గగా..
మేలో
9.17
శాతంగా
ఉంది.
తయారీ
ఉత్పత్తుల
టోకు
ద్రవ్యోల్బణం
మే
నెలలో
2.97
శాతం
నుంచి
సమీక్షా
కాలంలో
2.71
శాతానికి
తగ్గింది.

English summary

Wholersale inflation reached to 2015 lows at 4.12 percent big relief

Wholersale inflation reached to 2015 lows at 4.12 percent big relief

Story first published: Friday, July 14, 2023, 16:58 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *