Yoga poses for sinus relief: సైనస్‌ తగ్గాలంటే.. ఈ యోగాసనాలు ప్రాక్టిస్‌ చేయండి..!

[ad_1]

Yoga poses for sinus relief: వాతావరణంలో మార్పులు వచ్చినా, వర్షాకాలం, చలి పెరిగినా సైనస్‌ గదుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకి ఇబ్బందులు పెడుతుంది. సైనస్‌ కావిటీస్‌ వాపు కారణంగా ఈ సమస్య ఎదురవుతుంది. బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఇన్ఫెక్షన్లు, సైనస్‌ లైనింగ్‌ వాపు, వాతావరణంలో మార్పులతో సైనస్‌ సమస్య వస్తుంది. సైనస్‌ కారణంగా రెండు ముక్కులు బిగుసుకొని పోతాయి. తరచుగా జలుబు చేస్తుంది. తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరంగా ఉంటుంది. కనుబొమ్మలు జివ్వుమని లాగుతుంటాయి. దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. సైనసైటిస్‌ నుంచి ఉపశమనం పొందడానికి యోగా సహాయపడుతుందని యోగా, ఆధ్యాత్మిక గురువు, అక్షర యోగ సంస్థ వ్యవస్థాపకుడు హిమాలయన్‌ సిద్ధా అక్షర్‌ అన్నారు. యోగా తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ఉత్తేజపరిచేందుకు, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, ఎండార్ఫిన్‌లను విడుదల చేయడానికి సహాయపడుతుంది. కొన్ని యోగా ఆసనాలు ప్రత్యేకంగా ముక్కులోని గాలి మార్గాలను తెరచి సైనసైటిస్‌ లక్షణాలను తగ్గిస్తుంది.యోగా ఊపిరితిత్తులను విస్తరిస్తుంది, ఆక్సిజన్‌ను తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. యోగాసనాలు ఆడ్రినలిన్‌ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది, ఇది రక్త నాళాలను సంకోచించడంలో సహాయపడుతుంది. ఈ సంకోచం సైనస్ ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న వాపు తగ్గిస్తుంది.​

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *