Zee-Sony డీల్‌కి లైన్ క్లియర్.. ఇండస్‌ఇండ్ బ్యాంక్ గొడవ సెటిల్.. ఇక షేర్ దూకుడే..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Zee Entertainment: ఇండస్‌ఇండ్ బ్యాంక్ తో ఉన్న సమస్యను జీ ఎంటర్ టైన్మెంట్ పరిష్కరించుకున్నట్లు నేషనల్ లా ట్రిబునల్ కు వెల్లడించింది. ఇప్పటికే ఒప్పందం ప్రకారం కొంత మెుత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది. రెండవ విడతను జూన్ 30 నాటికి తిరిగి చెల్లింపు చేయనున్నట్లు సమాచారం.

ఇదే విషయాన్ని జీ ఎంటర్ టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ అధికారికంగా వెల్లడించాయి. దీంతో కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యను పరిష్కరించుకునేందుకు ఇద్దరూ ముందుకొచ్చాయి. దీంతో ఇండస్‌ఇండ్ ఇప్పుడు సోనీతో జీ విలీన పథకంపై తన అభ్యంతరాలను ఉపసంహరించుకుంటుంది. దీంతో ఇన్వెస్టర్లు సంతోషంగా ఉన్నారు. ఇకపై జీ స్టాక్ మార్కెట్లో దూకుడుగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Zee-Sony డీల్‌కి లైన్ క్లియర్.. ఇండస్‌ఇండ్ బ్యాంక్ గొడవ సెటి

ఎస్సెల్ గ్రూప్‌కు చెందిన సిటి నెట్‌వర్క్స్‌కు ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఇచ్చిన రూ.150 కోట్ల రుణానికి జీ సంస్థ గ్యారెంటర్‌గా ఉంది. అయితే డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ గ్యారెంటీ అగ్రిమెంట్ ను గౌరవించడంలో విఫలమైంది. సిటి నెట్‌వర్క్స్‌ తీసుకున్న టర్మ్ లోన్ చెల్లింపులు చేయకపోవటంతో ఆ బాధ్యత జీ సంస్థపై పడింది. ఈ క్రమంలో ZEELకి వ్యతిరేకంగా దివాలా చర్యలు తీసుకోవాలంటూ NCLT ముంబైలో ఫిబ్రవరి 22న వ్యాజ్యం దాఖలు చేసింది.

దీనికి ముందు జనవరిలో యాక్సిస్ బ్యాంక్ అనుబంధ సంస్థ యాక్సిస్ ఫైనాన్స్ సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించింది. జీ, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా మధ్య విలీనాన్ని వ్యతిరేకించింది. తాజా వార్త తర్వాత జీ షేర్లు మార్కెట్లో 4 శాతం మేర లాభపడి రూ.216.50 వద్ద ట్రేడవుతున్నాయి.

English summary

Line cleared to Zee Entertainment, Sony Merger as dispute with IndusInd bank under settlement

Line cleared to Zee Entertainment, Sony Merger as dispute wih IndisInd bank under settlment

Story first published: Wednesday, March 29, 2023, 13:38 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *