Zero Shadow Day: బెంగళూరులో అద్భుతం.. పట్టపగలే మాయమైన నీడ

[ad_1]

పట్టపగలే వస్తువులు, మనుషుల నీడ మాయమైన అరుదైన సంఘటనకు బెంగళూరు వేదికయ్యింది. మంగళవారం సరిగ్గా మధ్యాహ్నం 12:17 గంటలకు ఎండలో నిటారుగా ఉన్న వస్తువుల నీడ కనిపించలేదు. దాదాపు ఒకటిన్నర నిమిషాల పాటు ఈ అద్భుతం సాక్షాత్కరించింది. ఈ ఖగోళ వింతను జీరో షాడో గా వ్యవహరిస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా ఏటా రెండుసార్లు జీరో షాడో డే చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. రెండేళ్ల కిందట 2021లో ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకున్న ఈ ఖగోళ అద్భుతం ఇప్పుడు బెంగళూరులో కనిపించిందని పేర్కొన్నారు. జీరో షాడోకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను బెంగళూరువాసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సాధారణంగా కాంతిపరావర్తనం చెందినప్పుడు వెలుగు వెంటే నీడ కూడా ఉంటుంది. కానీ సూర్యకాంతిలో ఉన్నప్పటికీ నీడ కనిపించకపోవడమే జీరో షాడో. ఈ వింత జరిగిన రోజును జీరో షాడో డే గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది జీరో షాడో డే బెంగళూరులో చోటుచేసుకుంది. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తల ప్రకారం.. జీరో షాడో డే కర్కాటక, మకర రాశి మధ్య సంవత్సరానికి రెండుసార్లు కదులుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉత్తరాయణం, దక్షిణాయనం రెండింటిలోనూ సూర్యుని క్షీణత ఆ ప్రాంతాల అక్షాంశానికి సమానంగా ఉంటుంది. అందుకే సూర్యుడు నడి నెత్తిన కనిపిస్తాడు, దీంతో సూర్యకాంతి పడినప్పటికీ నీడ కనిపించదు.
ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో మరొకసారి చొప్పున ఏటా రెండుసార్లు జీరో షాడో డే వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వింత సెకనులో కొంత భాగం మాత్రమే ఉంటుంది కానీ, దాని ప్రభావం ఒకటిన్నర నిమిషాల వరకు కనిపిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.


Read MoreLatest National NewsAndTelugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *