PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ – ఈ జంట ‘తూనీగ తూనీగ..’ లవ్ స్టోరీ మీకు తెలుసా?

[ad_1]

నంత్ అంబానీ – రాధిక మర్చంట్ పెళ్లి.. ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ. వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకకు ప్రపంచ దిగ్గజాలు సైతం ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తరలివస్తున్నారు. ఇంతకీ అనంత్, రాధికల పెళ్లి పెద్దలు కుదిర్చినదా? లేదా ప్రేమించుకున్నారా అనే సందేహం చాలామందిలో ఉంది. అనంత్, రాధిక.. చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. ఆ స్నేహం కాస్తా.. ప్రేమగా మారి.. పెళ్లి వరకు చేరింది. అయితే, ఇప్పుడు జరిగేది పెళ్లి కాదండోయ్. ప్రస్తుతం జరుగుతున్నది ప్రీ-వెడ్డింగ్ సెర్మొనీ. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శుక్రవారం ప్రారంభమైన ఈ వేడుకలు.. మార్చి 3న ముగుస్తాయి. జులై నెలలో పెళ్లి చేసుకోనున్నారు.

స్నేహమంటే ఇదే!

అనంత్ అంబానీని చూసి.. చాలామంది అతడిని ఆమె ఎలా పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. కానీ, వారి స్నేహం గురించి తెలిస్తే.. ఆ ఆలోచనే రాదు. ప్రేమంటే రెండు మనసుల కలయిక. ఒకరినొకరు అర్థం చేసుకొనేది. అనంత్ అంబానీతో రాధిక స్నేహం ఇప్పటిది కాదు. బాల్యం నుంచి కొనసాగుతోంది. అనంత్‌కు అనారోగ్యంతో ఉన్నప్పుడు తోడుగా ఉన్నది రాధికానే అని సన్నిహితులు చెబుతుంటారు. అనంత్‌కు అన్నివిధాలా తోడుగా ఉంటూ.. ధైర్యాన్ని ఇచ్చింది ఆమేనని.. తిరిగి ఆరోగ్యంతో కోలుకోనేందుకు ఎంతో సహకరించిందని అంటారు. అందుకే, అంబానీ కుటుంబానికి ఆమె చాలా స్పెషల్ అంటారు.

అలా మొదలైంది..

రాధిక మర్చంట్ కూడా సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయే. ఎ‌న్‌కోర్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకులు వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్‌ల చిన్న కుమార్తె. అయితే, అనంత్, రాధిక కలిసి చదువుకోలేదు. వీరంతా సంపన్నులు కావడం వల్ల ఒకరి ఫంక్షన్స్‌కు మరొకరు హాజరయ్యేవారు. వారి సర్కిల్స్‌లో జరిగే వేడుకల్లో బిలినియర్ల పిల్లలంతా కలిసేవారు. అలా రాధిక, అనంత్ మధ్య స్నేహం కుదిరింది. అప్పటి నుంచి రాధిక.. అంబానీ ఫ్యామిలీకి దగ్గరయ్యింది. వారి ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌లో రాధిక మర్చంట్ ఉండాల్సిందే. చివరికి ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లిలో కూడా సందడంతా రాధికాదే. పెళ్లి వేడుకలో ఇషా చేయి పట్టుకుని నడవడంతో అంతా.. ఎవరా అమ్మాయి అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆమె అనంత్ గర్ల్‌ఫ్రెండ్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అయితే, అంతకు ముందే.. వీరి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దాని వెనుక మరో కథ ఉంది. 

2018లో బయటపడ్డ ప్రేమ.. 

ఉన్నత చదువుల కోసం అనంత్ రోడ్‌ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వ విద్యాలయానికి వెళ్లాడు. అదే సమయంలో రాధిక కూడా న్యూయార్క్ విశ్వ విద్యాలయంలో చదివేందుకు వెళ్లింది. అయితే, వీరు అక్కడ రహస్యంగా కలిసేవారని తెలిసింది. 2018లో లీకైన ఓ వైరల్ పిక్ కూడా వీరి ప్రేమను బయటపెట్టింది. ఇందులో ఒకే కలర్ డ్రెస్‌లో చాలా సన్నిహితంగా ఉన్నారు. అయితే, వారి కుటుంబ సభ్యులు గానీ, స్నేహితులు గానీ.. ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేయలేదు. అలాగని ఖండించలేదు కూడా. పైగా వీరిద్దరు సంపన్న కుటుంబానికి చెందినవారే కాబట్టి.. ఆ రూమర్స్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని అనారోగ్య కారణాల వల్ల అనంత్ అనారోగ్యానికి గురయ్యాడని, అప్పుడు రాధిక దగ్గరుండి అతడి బాగోగులు చూసుకుందనే వార్తలు వచ్చాయి. అయితే, అనంత్ కంటే రాధిక నాలుగేళ్లు పెద్దది. అనంత్ 1995, ఏప్రిల్ 10న జన్మించాడు. రాధిక 1994, డిసెంబర్ 18న పుట్టింది. గతేడాది జనవరి నెలలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. 


Also Read: నిశ్చితార్థానికి, పెళ్లికి ఇంత మార్పా? అనంత్ అంబానీ మళ్లీ బరువు పెరగడానికి కారణం అదేనట

మరిన్ని చూడండి[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *