PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

అనంత్‌ అంబానీ లైఫ్‌ స్టైల్‌కు సంబంధించిన ఆశ్చర్య పరిచే విషయాలు

[ad_1]

Anant Ambani Obesity: భారత్‌లోనే కాదు, మొత్తం ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక మర్చంట్‌ను వివాహం (Anant Ambani-Radhika Merchant Wedding) చేసుకోబోతున్నారు.

దేశంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తి ఇంట్లో జరిగే పెళ్లిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతోపాటు, అనంత్ అంబానీ జీవితం కూడా జనం నోళ్లలో నానుతోంది. అనంత్‌ అంబానీ ఎందుకు అంత లావుగా ఉన్నాడు, బరువెంత, అతని స్థూలకాయానికి కారణమేంటి, రోజూ ఏం తింటున్నాడు, జిమ్‌ చేస్తాడా, ఇతర అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా.. ఇలాంటి ప్రశ్నలను ప్రజలు గూగుల్‌ను అడుగుతున్నారు. 

జాతీయ మీడియా కథనాల ప్రకారం, అనంత్ అంబానీ గతంలో 208 కిలోల బరువున్నారు. వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కారణంగా ఆ బరువును చాలా వరకు తగ్గించుకుని సన్నబడ్డారు. ఆ తర్వాత మళ్లీ బరువు పెరిగారు.

అనంత్‌ అంబానీ ఆరోగ్య సమస్యలు
2017లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, అనంత్‌ తీవ్రమైన ఆస్తమా రోగి అని నీతా అంబానీ చెప్పారు. ఊపిరి పీల్చడానికి కూడా అతను ఇబ్బంది పడేవారట. ఆస్తమాను కంట్రోల్‌ చేయడానికి అనంత్‌కు చాలా స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చింది. వాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కారణంగా అనంత్ బరువు పెరిగింది. అనంత్ 208 కేజీలు ఉండేవారు, కానీ 2016 సంవత్సరంలో అతను బాగా సన్నబడి యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

బరువు తగ్గడానికి రోజూ వ్యాయామం
తన బరువును 208 కేజీల నుంచి కిందకు దించడానికి, అనంత్ ప్రతిరోజూ 5-6 గంటలు వ్యాయామం చేశారు. ప్రతిరోజూ 21 కి.మీ. నడిచారు. కార్డియో ఎక్సర్‌సైజ్‌ కూడా చేశారు.

బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారం
చక్కర లేని, ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండే, చాలా తక్కువ కొవ్వుతో ఉండే కార్బ్ డైట్‌ను అనంత్‌ ఫాలో అయ్యారు. ప్రతిరోజూ 1200-1400 కేలరీలు తీసుకుంటారు. అతని ఆహారంలో తాజా ఆకుపచ్చ కూరగాయలు, పప్పులు, మొలకలు, చిరుధాన్యాలు, జున్ను, పాల ఉత్పత్తులు ఉంటాయి. బరువు తగ్గించేందుకు అన్ని రకాల జంక్ ఫుడ్స్‌కు తిలోదకాలిచ్చారు.

అనంత్ అంబానీ 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గారు. కానీ అకస్మాత్తుగా అతని బరువు మళ్లీ పెరిగింది.

మళ్లీ పెరిగిన అనంత్ అంబానీ బరువు
2020లో, రాధిక మర్చంట్ పుట్టినరోజు వేడుకలో లీక్ అయిన వీడియో ఫుటేజ్‌లో, అనంత్ మళ్లీ బరువు పెరిగినట్లు నెటిజన్లు గమనించారు. 2022 డిసెంబర్‌లో, ఇషా అంబానీ కవల పిల్లలు తొలిసారి అంబానీ ఇంటికి వచ్చినప్పటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది, అప్పుడు కూడా అనంత్‌ ఊబకాయంతో కనిపించారు. ఇటీవల, అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ నిశ్చితార్థం జరిగింది. అనంత్ బరువు బాగా పెరిగినట్లు ఆ ఫొటోల్లో ఉంది.

అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ వివాహ వేడుకల్లో భాగంగా ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు (Pre Wedding Celebrations) ముహూర్తం దగ్గర పడింది. మార్చి 1, 2, 3 తేదీల్లో, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్‌ కాంప్లెక్స్‌లో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జులైలో వివాహం జరుగుతుంది.

మరో ఆసక్తికర కథనం: అద్దె ఇల్లు Vs సొంత ఇల్లు – ట్రెండింగ్‌లో జీరోధ సీఈవో సమాధానం

మరిన్ని చూడండి

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *