LIC Kanyadan Policy details in Telugu: మన దేశంలో చాలా మంది తండ్రులకు వారి కుమార్తెలంటే చాలా ఇష్టం. కానీ వాళ్ల పెళ్లి చేయాలంటే మాత్రం భయం. ఎందుకంటే.. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పెద్ద మొత్తంలో కట్నం ఇవ్వాలి, ఆడంబరంగా ఖర్చు చేయాలి. బాగా డబ్బున్న కుటుంబాలకు ఈ ఖర్చు ఒక విషయమే కాదు, పైగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికే  వాళ్లు ఇష్టపడతారు. కానీ… మన దేశంలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి కుటుంబాలదే మెజారిటీ నంబర్. కుమార్తె వివాహం ఘనంగా జరిపించాలని ఆ కుటుంబాలకూ ఉన్నా, డబ్బు కోసం వెతుక్కోవాల్సి వస్తుంది.

తమ ఇంటి ఆడపిల్ల పెళ్లిని ఆడంబరంగా జరిపించాలి, అదే సమయంలో డబ్బుకు ఇబ్బంది పడకూడదు అని కోరుకునే తల్లిదండ్రుల కోసం.. ప్రత్యేక జీవిత బీమా పథకాన్ని ఎల్‌ఐసీ ప్రారంభించింది. ఆ ప్లాన్‌ పేరు కన్యాదాన్ పాలసీ.

కన్యాదాన్‌ పాలసీని బాలిక తండ్రి మేనేజ్‌ చేస్తాడు. ఈ పాలసీ వ్యవధి 25 ఏళ్లు. కనీసం 13 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలు ప్రీమియం కట్టాలి. పాలసీ తీసుకునే పాప తండ్రి వయస్సు 18 ఏళ్లకు తగ్గకూడదు, 50 ఏళ్లు దాటకూడదు.

ఎల్‌ఐసీ కన్యాదాన్‌ పాలసీ పూర్తి వివరాలు (LIC Kanyadan Policy Details):

LIC కన్యాదన్ పాలసీ ప్రత్యేక లక్షణాల్లో వెడ్డింగ్‌ సేవింగ్స్‌ ఒకటి. రోజుకు 75 రూపాయల వరకు పాలసీదారు పొదుపు చేస్తే, తన కుమార్తె వివాహం నాటికి 14.5 లక్షల రూపాయలను జమ చేయవచ్చు. రోజుకు 151 రూపాయలు ఇన్వెస్ట్‌ చేస్తే, కుమార్తె వివాహ ఖర్చుల రూపంలో 31 లక్షల రూపాయలు చేతికి అందుతాయి.

పాలసీదారు (తండ్రి) చనిపోతే (Kanyadan Policy death benefits): పాలసీ కడుతున్న సమయంలో దురదృష్టవశాత్తూ తండ్రి మరణిస్తే, మిగిలిన ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

యాక్సిడెంటల్‌ డెత్‌ బెనిఫిట్‌: పాలసీదారుకు ఏదైనా ప్రమాదం వల్ల ఆకస్మిక మరణం సంభవిస్తే, నామినీకి తక్షణం 10 లక్షల రూపాయలను ఎల్‌ఐసీ చెల్లిస్తారు.

నాన్-యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్: ప్రమాదంలో కాకుండా సహజ మరణం సంభవించినప్పుడు కూడా LIC నుంచి తక్షణ ఆర్థిక సాయం అందుతుంది. ఆ సమయంలో పాలసీ కింద 5 లక్షల రూపాయలు ఇస్తారు. తక్షణ ఖర్చులు, బాధ్యతలు నెరవేర్చడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది.

ఏటా రూ.50 వేలు చెల్లింపు: తండ్రి మరణం తర్వాత, మిగిలిన ప్రీమియంలు కట్టాల్సిన అవసరం లేకుండానే ఈ పాలసీ కొనసాగుతుంది. పాలసీ మెచ్యూరిటీ సమయం వరకు సంవత్సరానికి 50,000 రూపాయలను ఎల్‌ఐసీ చెల్లిస్తుంది.

ప్రి-లుక్ పిరియడ్‌:
LIC కన్యాదాన్ పాలసీ తీసుకున్న తర్వాత అది మీకు నచ్చకపోతే… బీమా బాండ్‌ను స్వీకరించిన తేదీ నుంచి 15 రోజుల్లో దానిని వాపసు చేయవచ్చు. మీరు కట్టిన మొత్తంలో కొంత డబ్బును ఫైన్‌ రూపంలో ఇన్సూరెన్స్‌ కంపెనీ కట్ చేసి, మిగిలిన డబ్బును తిరిగి ఇస్తుంది.

సరెండర్ వాల్యూ:
ఏ కారణం వల్లనైనా LIC కన్యాదాన్ పాలసీని కొనసాగించలేకపోతే, కనీసం రెండు సంవత్సరాలు పేమెంట్స్‌ చేసిన తర్వాత ఎప్పుడైనా దానిని సరెండర్ చేయవచ్చు. ఆ సందర్భంలో… గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ లేదా స్పెషల్ సరెండర్ వాల్యూలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని LIC చెల్లిస్తుంది.

ఇతర వివరాలు:
18 సంవత్సరాల వయస్సు తర్వాత, బాలిక ఉన్నత విద్య కోసం గరిష్టంగా 50% విత్‌డ్రా చేసుకోవచ్చు.
పాపకు 10 సంవత్సరాల వయస్సు రాక ముందు, ఖాతా తెరవడానికి అమ్మాయి పేరును ఉపయోగించవచ్చు.
బాలిక బర్త్‌ సర్టిఫికెట్‌, బాలిక & సంరక్షకుల చిరునామాలు, వ్యక్తిగత గుర్తింపు పత్రాలను పోస్టాఫీస్‌ లేదా బ్యాంక్‌లో అందించాలి.
ఈ ఖాతా తెరవాలంటే కనీసం రూ.250 అవసరం.
ఈ అకౌంట్‌ను భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా బదిలీ చేయవచ్చు.
ఒకవేళ అమ్మాయి మరణిస్తే, డెత్ సర్టిఫికేట్ కాపీ తీసుకొచ్చి అకౌంట్‌ క్లోజ్‌ చేయవచ్చు. అప్పుడు డిపాజిట్ చేసిన డబ్బును వడ్డీతో కలిపి సంరక్షకుడికి చెల్లిస్తారు. ఒకవేళ దీర్ఘకాలిక అనారోగ్యం వస్తే, ఖాతాను 5 సంవత్సరాల్లో క్లోజ్‌ చేయవచ్చు.

భారతదేశంలోని ప్రతి పౌరుడు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ఈ స్కీమ్‌కు అర్హులు. ఈ స్కీమ్‌ను అందించే బ్యాంక్ లేదా పోస్టాఫీసుల్లో అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ఒక కుమార్తె కోసం ఒక అకౌంట్‌ మాత్రమే తెరవాలి, అంతకుమించి అనుమతి లేదు.

మరో ఆసక్తికర కథనం: కోకా కోలా నుంచి మొదటి లిక్కర్‌ బ్రాండ్‌ – రేటెంత, ఎక్కడ దొరుకుతుందో తెలుసా?Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *