ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీటెనర్‌ తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త..!

[ad_1]

Artificial sweeteners:డయాబెటిక్‌ పేషెంట్స్‌ చక్కెరకు బదులుగా.. ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీటెనర్‌ తీసుకుంటూ ఉంటారు. షుగర్‌ రాకుండా జాగ్రత్తపడేవారు, బరువు తగ్గలనుకునేవారు.. వారి డైట్‌లో చక్కెరను తీసుకోవడం మానేసి.. ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీటెనర్‌ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. కృత్రిమ తీపి పదార్థాలతో తయారైన కూల్‌డ్రింకులు, షుగర్‌‌‌‌ ఫ్రీ ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. వీటిల్లో కేలరీలు లేకపోవటం వల్ల ఇవి తీసుకుంటే షుగర్‌, బరువు కంట్రోల్‌ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ, కృత్రిమ తీపి పదార్థాలు ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీటెనర్‌ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

క్యాన్సర్‌ ముప్పు..

ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీట్ పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారికి.. క్యాన్సర్ ముప్పు 95% ఎక్కువగా ఉంటుందని.. ఓ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఆస్పర్టేమ్‌, ఏస్‌సల్ఫేమ్‌ పొటాషియం ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీటెనెర్‌తో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుందని బయటపడింది. ఆస్పర్టేమ్‌తోనే ఊబకాయం ముడిపడిన మలద్వారం, , స్వరపేటిక, అన్నవాహిక, జీర్ణాశయం, కాలేయం, నోరు, అండాశయ, ఎండోమెట్రియం, ప్రోస్టేట్‌ క్యాన్సర్ల ముప్పు 15% పెరుగుతున్నట్టు తేలింది. ఏస్‌సల్ఫేమ్‌ పొటాషియం, ఆస్పర్టేమ్‌లను తక్కువగా తీసుకున్నా.. క్యాన్సర్‌ ముప్పు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను దెబ్బతీస్తాయ్..

మనం ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్స్‌ తీసుకున్నప్పుడు.. మనం తీపి పదార్థం తింటున్నామని, మెదడుకు సిగ్నల్స్‌ వెళ్తాయి. బ్రెయిన్‌.. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే ఇన్సులిన్‌ను విడుదల చేయడానికి సూచనలు ఇస్తుంది. కృత్రిమ తీపి పదార్థాలు తీసుకుంటే.. మన ప్యాంక్రియా నుంచి ఇన్సిలన్‌ విడుదల అవుతుంది. జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ ప్రకారం, కృత్రిమ తీపి పదార్థాలు.. రక్తంలో ఇన్సులన్‌ స్థాయిలను పెంచుతుంది. ఇన్సులిన్ నిరోధకత కారణంగా రిసెప్టర్ యాక్టివిటీ తగ్గుతుంది.

జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా ఎఫెక్ట్‌ అవుతుంది..

మన జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా ఉండటం చాలా అవసరం. ఆహారం జీర్ణం కావడానికి ఇవి సహాయపడతాయి. కృత్రిమ తీపి పదార్థాలు.. గట్‌ చెడు బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. కృత్రిమ తీపి పదార్థాలు పొట్టలోని బ్యాక్టీరియా కౌంట్‌, టైప్‌ మారిపోతాయి. ఏంజిలా రస్కిన్‌ యూనివర్శిటీ (ఏఆర్‌యూ) మాలెక్యులర్‌ పరిశోధన ప్రకారం ఆ బ్యాక్టీరియా పాతోజనిక్‌ను మార్చేస్తాయి. ఇలా మారిన బ్యాక్టీరియా వాటంతట అవే కలసి… కాకో-2 సెల్స్‌ను చంపేస్తాయి. ఇంటెస్టిన్‌ గోడలోని ఎపితెలియల్ సెల్స్‌ను కాకో-2 సెల్స్‌ అంటారు. వీటి మీద కృత్రిమ తీపి పదార్థాల ప్రభావం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

బరువు పెరుగుతారు..

చాలా మంది.. ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీటెనర్‌తో చేసిన పదార్థాలు తీసుకుంటే బరువు తగ్గుతామనే భ్రమలో ఉంటారు. కానీ ఇవి మనం వెయిట్‌ గెయిన్‌ అవ్వడానికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి టేస్ట్‌బడ్‌లను బలహీనపరుస్తాయి. కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.

ఇన్ఫ్లమేషన్‌కు కారణం అవుతుంది..

కృత్రిమ తీపి పదార్థాలు లివర్‌ను బలహీనపరుస్తాయి.. దీంతో ఇన్ఫ్లమేషన్‌కు కారణం అవుతాయి. అస్పర్టమే ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీటెనర్‌లో ఒకటి. ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, ఒకవేళ మీకు ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్‌ సెన్సిటివిటీ ఉంటే.. మీ ఇమ్యూనిటీ కెమికల్స్‌ను ఎటాక్‌ చేస్తూ.. ఫారిన్‌ పదార్థాలకు రియాక్ట్‌ అవుతుంది. ఇది ఇన్ప్లమేషన్‌ను ట్రిగర్‌ చేస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *