PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – Sun Pharma నెత్తిన మరో మొట్టికాయ

[ad_1]

Stocks to watch today, 19 December 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 48 పాయింట్లు లేదా 0.26 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,366 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

టెక్ మహీంద్ర: ఈ ఐటీ మేజర్‌కు నెదర్లాండ్స్‌లో ఉన్న అనుబంధ సంస్థ డైనకామర్స్ హోల్డింగ్స్ BVలో (Dynacommerce Holdings BV) ఉన్న మొత్తం వాటాను దాని స్టెప్-డౌన్ అనుబంధ సంస్థ కొమ్‌వివా నెదర్లాండ్స్‌కు (Comviva Netherlands) దాదాపు రూ. 58 కోట్లకు విక్రయించనుంది. జనవరి 2023 మొదటి వారంలో డీల్‌ ఒప్పందం మీద సంతకాలు చేస్తారని, అదే సమయంలో లావాదేవీ కూడా పూర్తవుతుందని భావిస్తున్నారు.

సన్ ఫార్మా: ఇప్పటికే ఇంపోర్ట్‌ అలెర్ట్‌ కింద ఉన్న హలోల్ ఫెసిలిటీకి US హెల్త్ రెగ్యులేటర్ వార్నింగ్‌ లెటర్‌ను కూడా సన్‌ ఫార్మా అందుకుంది. మంచి ఉత్పత్తి పద్ధతుల (cGMP) నిబంధనలకు సంబంధించి ప్రస్తుతం ఈ వార్నింగ్‌ లెటర్‌ అందుకుంది.

News Reels

టాటా మోటార్స్: ఈ స్వదేశీ ఆటో మేజర్‌కు చెందిన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ML స్మార్ట్ సిటీ మొబిలిటీ సొల్యూషన్స్ (ML Smart City Mobility Solutions), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో 12 సంవత్సరాల పాటు 921 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా, నిర్వహణ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

డా.రెడ్డీస్ లేబొరేటరీస్: నెదర్లాండ్స్‌లో తనకు చెందిన ఒక ఫ్లాంట్‌ ఆస్తులు, అప్పులను విక్రయించడానికి ఈ డ్రగ్ మేకర్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ BV (DRRDBV) ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన డెల్‌ఫార్మ్ గ్రూప్‌లోని డెల్‌ఫార్మ్ డెవలప్‌మెంట్ లైడెన్ BVతో ఆస్తి కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

యస్ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ రుణదాత, JC ఫ్లవర్స్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి రూ. 48,000 కోట్ల స్ట్రెస్‌డ్‌ అసెట్స్‌తో కూడిన అసెట్ లోన్ పోర్ట్‌ఫోలియోను అప్పగించే తతంగాన్ని ముగించింది. దీని వల్ల యెస్‌ బ్యాంక్‌ ఖాతా పుస్తకాల్లో భారీ భారం తగ్గుతుంది.

జిందాల్ స్టీల్ అండ్ పవర్: మన దేశంలో ఎనిమిది రకాల హై-ఎండ్ అల్లాయ్స్‌ను తయారు చేసేందుకు, స్పెషాలిటీ స్టీల్ కోసం PLI పథకం కింద రూ. 7,930 కోట్లను ఈ మెటల్ ప్లేయర్ వెచ్చించనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం క్వాలిఫైయర్లలో JSPL ఒకటి.

ది ఫీనిక్స్ మిల్స్: గుజరాత్‌లోని సూరత్‌లో దాదాపు రూ. 510 కోట్లతో 7.22 ఎకరాల భూమిని ఈ రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసింది. కంపెనీకి చెందిన పరోక్ష అనుబంధ సంస్థ అయిన ‘థాత్ మాల్ అండ్‌ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా ఈ భూమిని స్వాధీనం చేసుకుంది.

JSW ఎనర్జీ: JSW ఎనర్జీ (బార్మర్) రూ. 995.90 కోట్ల విలువైన 99,59 కోట్ల బోనస్ షేర్లను, ఒక్కో షేరును రూ. 10 చొప్పున జారీ చేసింది. JSW ఎనర్జీ (బార్మర్), JSW ఎనర్జీకి చెందిన పూర్తి యాజమాన్య మెటీరియల్ అనుబంధ సంస్థ.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *