ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – ఫోకస్‌లో Equitas Small Fin Bank

[ad_1]

Stocks to watch today, 06 January 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 2.5 పాయింట్లు లేదా 0.01 శాతం రెడ్‌ కలర్‌లో 18,062 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

గోద్రెజ్ ఆగ్రోవెట్: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో రూ. 250 కోట్ల పెట్టుబడితో ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. పామాయిల్‌ను ప్రాసెస్ చేసే ఈ ఫ్లాంట్‌ సామర్థ్యం గంటకు 30 టన్నులు. దీనిని 60 టీపీహెచ్‌కు పెంచవచ్చు. ఖమ్మం జిల్లాలో ఇదే అతి పెద్ద ప్రైవేట్ కంపెనీ పెట్టుబడి.

బజాజ్ ఫిన్‌సర్వ్: కంపెనీ అనుబంధ సంస్థ బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ (ajaj Allianz General Insurance Co Ltd) స్థూల ప్రత్యక్ష ప్రీమియం అండర్‌రైటింగ్‌ 2022 డిసెంబర్‌లో రూ.1,209 కోట్లుగా ఉంది. డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలానికి, ఇది రూ. 11,609 కోట్లుగా ఉంది.

live reels News Reels

IDBI బ్యాంక్: ఈ బ్యాంక్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత, బ్యాంక్‌లో మిగిలిన ప్రభుత్వ వాటాను “పబ్లిక్”గా తిరిగి వర్గీకరించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) సమ్మతి తెలిపింది. బ్యాంక్‌లో ప్రభుత్వ ఓటింగ్ హక్కులు, బ్యాంకు మొత్తం ఓటింగ్ హక్కుల్లో 15%కు మించకూడదనే షరతుపై సమ్మతి ఇచ్చింది.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: తాత్కాలిక డేటా ప్రకారం, 2022 డిసెంబర్ నాటికి బ్యాంక్ స్థూల అడ్వాన్సులు 27% పెరిగి రూ. 24,923 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం డిపాజిట్లు గత ఏడాది కంటే 31% పెరిగి రూ. 23,393 కోట్లకు చేరుకున్నాయి. డిసెంబరు 31 నాటికి డిజ్‌బర్స్‌మెంట్స్‌ క్రితం ఏడాదితో పోలిస్తే 68% పెరిగి రూ. 4,797 కోట్లకు చేరుకున్నాయి.

రైల్ వికాస్ నిగమ్: ISC ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఈ కంపెనీ చేపట్టిన జాయింట్ వెంచర్, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ కోసం బ్యాలస్ట్‌లెస్ ట్రాక్ డిజైన్, నిర్మాణం, ప్రారంభం కోసం రూ. 166 కోట్ల విలువైన ఆర్డర్‌ అందుకుంది.

టాటా మోటార్స్: UKలో అనుబంధ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు 2022 డిసెంబర్‌లో 12.5% తగ్గి 3,501 యూనిట్లకు చేరుకున్నాయి. జాగ్వార్ అమ్మకాలు 32% క్షీణించి 909 యూనిట్లకు చేరుకోగా, ల్యాండ్ రోవర్ అమ్మకాలు స్వల్పంగా 2,592 యూనిట్లకు పడిపోయాయి.

ఇండోవిండ్ ఎనర్జీ: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం, గత తొమ్మిది నెలల ఆదాయాలను పరిశీలించి ఆమోదించడానికి డైరెక్టర్ల బోర్డు సమావేశం అవుతుంది.

ఇండస్ ఫైనాన్స్: డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం, గత తొమ్మిది నెలల ఆదాయాలను పరిశీలించడానికి, ఆమోదించడానికి డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతుంది.

ప్రెసిషన్ వైర్స్ ఇండియా: ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధులను సేకరించే ప్రతిపాదనను పరిశీలించేందుకు డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *