ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – బైబ్యాక్‌ రేటు ప్రకటించిన Paytm

[ad_1]

Stocks to watch today, 14 December 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 82 పాయింట్లు లేదా 0.44 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,783 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

HDFC బ్యాంక్, HDFC: తన అనుబంధ సంస్థ HDFC బ్యాంక్‌కు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (NCDs) బదిలీ చేయడానికి ఎక్స్ఛేంజీల నుంచి అనుమతి వచ్చినట్లు HDFC తెలిపింది. HDFC బ్యాంక్‌తో HDFC విలీనాన్ని సులభతరం చేసే ప్రక్రియలో ఇది ఒక భాగం.

అల్ట్రాటెక్ సిమెంట్: రాజస్థాన్‌లోని పాలి సిమెంట్ వర్క్స్‌లో 1.9 mtpa సామర్థ్యంతో గ్రీన్‌ ఫీల్డ్ క్లింకర్ బ్యాక్డ్ గ్రౌండింగ్ ఫ్లాంటును ప్రారంభించింది. ఈ అనుబంధ సంస్థతో పాటు రాజస్థాన్‌లోని 5 వేర్వేరు ప్లాంట్లలో 16.25 mtpa సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది.

News Reels

యాక్సిస్ బ్యాంక్: రూ.1 కోటి ముఖ విలువ గల 12,000 నాన్ కన్వర్టబుల్, బాసెల్ III కంప్లైంట్ టైర్ II బాండ్ల కేటాయింపు కోసం యాక్సిస్‌ బ్యాంక్‌కు డైరెక్టర్ల బోర్డు ఆమోదం లభించింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన, సంవత్సరానికి 7.88 శాతం కూపన్ రేట్‌తో మొత్తం రూ. 12 వేల కోట్లను ఈ ప్రైవేట్‌ సెక్టార్‌ లెండర్‌ సమీకరిస్తుంది.

యెస్ బ్యాంక్: ప్రైవేట్ ఈక్విటీ మేజర్‌ కంపెనీలు కార్లైల్ గ్రూప్, అడ్వెంట్ యెస్‌ బ్యాంక్‌లో 9.99 శాతం వాటాను తీసుకున్నాయి. వారెంట్లను ఈక్విటీగా మార్చడంతో, ఈ రెండు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు కలిసి యెస్ బ్యాంక్‌లోకి సుమారు రూ. 8,896 కోట్లు తెస్తాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా: ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ రుణదాత, నైనిటాల్ బ్యాంక్‌లో తన మెజారిటీ వాటాను విక్రయించాలని యోచిస్తోంది. నైనిటాల్ బ్యాంక్‌లో (NBL) మెజారిటీ స్టేక్‌ ఉపసంహరణను బ్యాంక్ ఆఫ్ బరోడా డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. పెట్టుబడిదారుల కోసం ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానిస్తూ ఒక ప్రకటనను అధికారికంగా జారీ చేసింది.

One97 కమ్యూనికేషన్స్ (Paytm): షేర్ల బై బ్యాక్‌ ధరను పేటీఎం ప్రకటించింది. ఒక్కో షేరును రూ. 810 చొప్పున తిరిగి కొనుగోలు చేసేందుకు రూ. 850 కోట్ల విలువైన షేర్ బై బ్యాక్ పథకాన్ని ప్రకటించింది. బై బ్యాక్ ప్రోగ్రాం కోసం ఓపెన్ మార్కెట్ మార్గాన్ని ఎంచుకుంది.

TVS మోటార్ కంపెనీ: Euro-V ఉద్గార నిబంధనలకు అనుగుణంగా టర్కీ మార్కెట్‌లోకి బైకులను తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఈ టూ వీలర్ ప్లేయర్ తెలిపింది. యూరో 5 ప్రమాణాలకు అనుగుణంగా జూపిటర్, NTORQ రేస్ ఎడిషన్, రైడర్, అపాచీ RTR 200 4V వంటి మోడళ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

అదానీ ట్రాన్స్‌మిషన్: అదానీ గ్రూప్‌లోని ఈ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ, తన పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా అదానీ కూలింగ్ సొల్యూషన్స్‌ను ఏర్పాటు చేసింది. శీతలీకరణ వ్యవస్థ వ్యాపారాన్ని కొనసాగించేందుకు సోమవారం ఈ కంపెనీని ప్రారంభించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *