PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – బిజినెస్‌ కోసం బిగ్‌ ప్లాన్‌లో SBI

[ad_1]

Stocks to watch today, 15 December 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 37 పాయింట్లు లేదా 0.20 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,712 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: టైర్ I బాండ్ల ద్వారా రూ. 10,000 కోట్ల మూలధన సమీకరించాలన్న స్టేట్‌ బ్యాంక్‌ ప్రణాళికకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. అదనపు టైర్ 1 (AT1) బాండ్ల ద్వారా రూ. 10,000 కోట్ల వరకు నిధుల సమీకరణకు భారత ప్రభుత్వం కూడా సమ్మతి తెలపాల్సి ఉంటుంది.

విప్రో: మిడిల్ ఈస్ట్‌లో కొత్త ఆర్థిక సేవల సలహా సంస్థ క్యాప్కోను (Capco) విప్రో ప్రారంభించింది. డిజిటలైజేషన్, వ్యాపార ఏకీకరణ కార్యక్రమాలను ప్రారంభించడానికి మిడిల్‌ ఈస్ట్‌లోని ఆర్థిక సేవల సంస్థలకు వ్యూహాత్మక నిర్వహణ, సాంకేతిక సలహాలు, సామర్థ్యాలను క్యాప్కో అందిస్తుంది.

News Reels

టాటా మోటార్స్: 5,000 యూనిట్ల XPRES-T EVలను సరఫరా చేయడానికి ఎవరెస్ట్ ఫ్లీట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ స్వదేశీ ఆటో మేజర్ తెలిపింది. ఒప్పందంలో భాగంగా, ముంబైకి చెందిన ఎవరెస్ట్ ఫ్లీట్‌కు తొలి విడతగా 100 యూనిట్లను టాటా మోటార్స్‌ అందజేసింది.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్: ఒక ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్‌లో రూ. 330.61 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రతిపాదన ఓకే అయింది. ప్రాజెక్టుల మీద పెట్టుబడులకు కంపెనీ డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపింది.

IRCTC: IRCTCలో 5 శాతం వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా రూ. 680 ఫ్లోర్ ప్రైస్‌తో కేంద్ర ప్రభుత్వం అమ్మి, రూ. 2,700 కోట్ల వరకు సమీకరించవచ్చు. OFS బేస్ ఇష్యూ సైజ్‌ 2 కోట్ల షేర్లు లేదా 2.5 శాతం వాటాగా ఉంటుంది. మరో 2.5 శాతం ఓవర్ సబ్‌స్క్రిప్షన్‌ని నిలుపుకునే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఇష్యూ సైజ్ 4 కోట్ల షేర్లు లేదా 5 శాతంగా మారుతుంది.

PVR, INOX లీజర్: మల్టీప్లెక్స్ చైన్‌ల ప్రతిపాదిత విలీనానికి వ్యతిరేకంగా నాన్‌ ప్రాఫిట్‌ గ్రూప్‌ కట్స్‌ (CUTS) ఇచ్చిన తన ఫిర్యాదును ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ CCI తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను (NCLAT‌) కట్స్‌ ఆశ్రయించింది. PVR, INOXలను తన పిటిషన్‌లో ప్రతివాదులగా చేర్చింది.

పూనావాలా ఫిన్‌కార్ప్: వ్యాక్సిన్ మేజర్ సైరస్ పూనావాలా గ్రూప్‌నకు చెందిన ఈ నాన్ బ్యాంకింగ్ విభాగం, తన హౌసింగ్ అనుబంధ సంస్థ పూనావలా హౌసింగ్ ఫైనాన్స్‌ను ప్రైవేట్ ఈక్విటీ మేజర్ TPGకి రూ. 3,900 కోట్లకు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. 

VRL లాజిస్టిక్స్: ప్రమోటర్ విజయ్ బసవన్నెప్ప సంకేశ్వర్, ఈ లాజిస్టిక్స్ కంపెనీలో 5.4 శాతం వాటాను లేదా  47.92 లక్షల షేర్లను ఒక్కో షేరును సగటున రూ. 570 చొప్పున అమ్మారు. రూ. 273.14 కోట్ల మొత్తానికి బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా ఆఫ్‌లోడ్ చేశారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *