PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Marico, Jubilant Food, HAL

[ad_1]

Stock Market Today, 05 October 2023: యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్ల సిగ్నల్స్‌ బుధవారం మన ఈక్విటీలపై బాగా ప్రభావం చూపాయి, మార్కెట్లను పడేశాయి.

లాభాల్లో అమెరికా స్టాక్స్
US స్టాక్స్‌ బుధవారం గ్రీన్‌లో ముగిశాయి, నాస్‌డాక్ బుధవారం 1% పైగా లాభపడింది. తాజాగా విడుదలైన US ప్రైవేట్ పేరోల్స్‌ సెప్టెంబర్‌లో ఊహించిన దాని కంటే తక్కువగా పెరిగింది.

పెరిగిన ఆసియా షేర్లు
వాల్ స్ట్రీట్‌ స్టాక్స్‌ ర్యాలీ చేయడంతో ఆసియాలో షేర్లు పెరిగాయి, వరుస నష్టాల తర్వాత మార్కెట్లకు కొంత ఉపశమనం లభించింది. ట్రేడర్ల దృష్టి శుక్రవారం విడుదలయ్యే US జాబ్‌ డేటాపైకి మళ్లింది.

ఇవాళ ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 16 పాయింట్లు లేదా 0.08 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,499 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

బంధన్ బ్యాంక్: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (Q2FY24) బంధన్ బ్యాంక్ అడ్వాన్స్‌లు ఏడాది ప్రాతిపదికన 12% వృద్ధి చెంది రూ. 1.08 లక్షల కోట్లకు చేరుకోగా, రుణ వసూలు సామర్థ్యం (loan collection efficiency) 98% వద్ద స్థిరంగా ఉంది.

RBL బ్యాంక్‌: సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ రిటైల్ అడ్వాన్సులు గత ఏడాది ఇదే కాలం కంటే (YoY) 34%, గత త్రైమాసికం కంటే ‍‌(QoQ) 8% పెరిగాయి. హోల్‌సేల్‌ అడ్వాన్స్‌లు 7% YoY పెరిగాయి, QoQలో ఫ్లాట్‌గా ఉన్నాయి.

PNB: 2023 జులై-సెప్టెంబర్‌ కాలంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ డిపాజిట్లు YoY 10% పెరిగి రూ.13.08 లక్షల కోట్లకు చేరుకోగా, అదే కాలంలో దేశీయ అడ్వాన్సులు 14% పెరిగి రూ.9.07 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

మారికో: రెండో త్రైమాసికంలో, FMCG మేజర్‌ మారికో ఇండియన్‌ వాల్యూమ్స్‌ లో-సింగిల్‌ డిజిట్‌లో YoY పెరిగాయి. పారాచూట్ కొబ్బరి నూనె, సఫోలా ఎడిబుల్ ఆయిల్‌ సహా వాల్యూ యాడెడ్ హెయిర్ ఆయిల్స్‌లో లో-సింగిల్ డిజిట్ వాల్యూ పెరుగుదల దీనికి కారణం. 

జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్: డొమినోస్‌లో పెద్ద పిజ్జాల ధరలను కంపెనీ తగ్గించిందన్న వార్తలను జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ఖండించింది, రేట్లు తగ్గించలేదని స్పష్టం చేసింది.

ఎక్సైడ్ ఇండస్ట్రీస్: ఎక్సైడ్ ఇండస్ట్రీస్, తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్‌ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో సబ్‌స్క్రైబ్‌ చేసుకుని, రూ.340 కోట్లు పెట్టుబడి పెట్టింది.

హిందుస్థాన్ జింక్:ఈ కంపెనీ సరఫరా గొలుసు, రవాణా కార్యకలాపాల్లో గ్రీన్‌లైన్ మొబిలిటీ సొల్యూషన్ లిమిటెడ్ ఎల్‌ఎన్‌జితో నడిచే ఫ్లీట్‌ను వినియోగించడానికి  హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఒక ఒప్పందంపై సంతకం చేసింది.

HAL: భారత రక్షణ రంగంలోని పెద్ద కంపెనీ హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌కు ఆర్డర్ల వరద వస్తోంది. తాజాగా, భారత వైమానిక దళం హెచ్‌ఏఎల్ నుంచి మరో 97 LCAలను కొనుగోలు చేయబోతోంది.

IEX: సెప్టెంబర్‌ క్వార్టర్లో IEX మొత్తం వాల్యూమ్స్‌ 13% YoY పెరిగి 9147 MUకి చేరుకున్నాయి. రియల్‌ టైమ్‌ మార్కెట్‌ వాల్యూమ్‌ 2923 MU వద్ద ఉంది, గత సంవత్సరం కంటే 33% పెరిగింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: సిబిల్‌ స్కోర్‌లో మీరు ‘పూర్‌’ అయినా క్రెడిట్‌ కార్డ్‌ కచ్చితంగా వస్తుంది, బ్యాంకులు పిలిచి మరీ ఇస్తాయి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *