PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఇవి తింటే.. లివర్‌లో చెత్త బయటకు వస్తుంది..!

[ad_1]

Liver Detox Foods: మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాల్లో లివర్‌ ఒకటి. విటమిన్లు, గ్లూకోజ్‌, విటమిన్లు, ఐరన్‌ వంటి వాటిని నిల్వ చేసుకొని అవసరమైనపుడు శక్తిని విడుదల చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి పోషకాలు అందడానికి ఉపయోగపడే పైత్యరసాన్ని (Bile) విడుదల చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు స్థిరంగా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. రక్తంలో కలిసే వ్యర్థాలను, విషతుల్యాలను బయటకు పంపిస్తుంది. లివర్‌ సరిగ్గా పనిచేయకపోతే.. శరీర వ్యవస్థలన్నీ కుప్పకూలుతాయి. ఈ క్రమంలో కాలేయాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని డీటాక్స్‌ చేసే లివర్‌ను కూడా శుభ్రం చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

liver

liver

ఈ లక్షణాలు కనిపిస్తాయి..

MBG హెల్త్ ప్రకారం, లివర్‌లో మలినాలు పేరుకున్నప్పుడు.. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

  • తీపి ఎక్కువగా తినాలనిపించడం
  • కడుపు నొప్పి
  • అనారోగ్య భావన
  • దద్దుర్లు
  • దురద
  • గ్యాస్, ఎసిడిటీ
  • శరీరం నుంచి వాసన
  • ఒత్తిడి, ఆందోళన
  • మానసిక కల్లోలం

​బాదం..

బాదంలో విటమిన్‌ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విటమిన్ ఇ ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతుందని, లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుందని NCBI అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మీ లివర్‌ను హెల్తీగా ఉంచుకోవడానికి రోజు.. నానబెట్టిని బాదం గింజలు తింటే.. మంచిది.

బీట్‌రూట్..

బీట్‌రూట్‌లో బీటాలైన్ అనే ఫైటోన్యూట్రియెంట్ ఉంటుంది, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్‌కు కారణం అవుతుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో బీటాలైన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది లివర్‌ ఇన్ఫ్లమేషన్‌, లివర్‌ సమస్యలు రాకుండా కాపాడుతుంది. బీటీరూట్‌ తీసుకుంటే, శరీరంలో డీటాక్స్‌ ఎంజైమ్స్‌ పెరుగుతాయి. ప్రతి రోజు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తీసుకుంటే.. లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది.

సిట్రస్‌ పండ్లు..

నిమ్మ, ఆరెంజ్‌, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి హై ప్యాట్‌ డైట్‌ శారీరక ఒత్తిడిని తొలగిస్తాయి. ఈ పండ్లు తింటే.. లివర్‌లో టాక్సిన్స్‌ తొలగుతాయి. మీ తరచుగా సిట్రస్‌ పండ్లు తింటే.. లివర్‌ డీటాక్స్‌ అవుతుంది.

గ్రీన్‌ టీ..

గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు లీవర్‌ డీటాక్స్‌కు సహాయపడతాయి. గీన్‌ టీ లివర్‌లోని విష పదార్థాలను నీటిలో కరిగేలా చేసి న్యూట్రల్‌ చేస్తాయి. మూత్రం ద్వారా వాటిని తొలగించడంలో సహాయపడుతుంది.

ద్రాక్ష..

నలుపు ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచే.. రెస్వెరాట్రాల్ ఉంటుంది. గ్రేప్‌ జ్యూస్‌ తరచుగా తాగితే.. లివర్‌ ఇన్ఫ్లమేషన్‌ నుంచి రక్షిస్తుంది.

వాల్‌నట్స్‌..

వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్‌లో ఒమేగా 6, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మెండుగా ఉంటాయి. వీటితోపాటు పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. వాల్‌నట్స్‌ ఫ్యాటీ లివర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *