ఈ పాలు తాగితే.. బ్రెయిన్‌ షార్ప్‌ అవుతుంది..!

[ad_1]

Fennel Seeds Milk: పాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చిన్నా, పెద్దా… అందరూ క్రమంతప్పకుండా పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. పాలలో పాలలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, ఫాస్ఫరస్‌ పాంథోనిక్‌ యాసిడ్‌, సెలీనియమ్‌, నియాసిన్‌ లాంటి మూలకాలు, విటమిన్‌-ఎ, డి, బి6 లాంటి పోషకాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కేవలం పాలు తాగితేనే మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. పాలలో సోంపు వేసుకుని తాగితే.. దాని శక్తి పెరుగుతుంది. పాలు, సోంపు కాంబినేషన్‌ మెదడు మేలు చేస్తాయని, శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సోంపు పాలు తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? వీటిని ఎలా తయారు చేసుకోవచ్చు? అనే విషయాల గురించి ప్రముఖ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా మనకు వివరించారు.

సోంపు పాలు

ఎలా తయారు చేసుకోవాలి..?

ఒక చిన్న చెంచా సోంపు గింజలు తీసుకోండి. తర్వాత 1 గ్లాసు పాలలో వేసి మరిగించండి. ఆ తర్వాత టేస్ట్‌కు అనుగుణంగా తేనె, బెల్లం యాడ్‌ చేసుకోవచ్చు. అంతే.. టేస్టీ టేస్టీ సోంపు పాలు రెడీ.

బ్రెయిన్‌ షార్ప్‌ అవుతుంది..

సోపులో విటమిన్-సి, క్వెర్సెటిన్ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి బ్రెయిన్‌ ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. దీని కారణంగా, మెదడు చాలా కాలం పాటు యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పాలు రాత్రి పడుకునే ముందు తాగితే బ్రెయిన్‌ షార్ప్‌ అవుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ పాలు పిల్లలకు ఇస్తే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

చెత్త తొలగుతుంది..

సోంపు గింజల్లో డీటాక్సిన్‌ గుణాలు ఉన్నాయి. ఇవి రక్తం నుంచి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. సోపు పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు తొలగడం వల్ల.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ పాలు తాగితే మంచిది.

ప్రశాంతంగా నిద్రపోతారు..

రాత్రిపూట సోపు పాలు తాగితే.. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మనస్సు, శరీరం విశ్రాంతి పొందాలంటే 7-8 గంటల మంచి నిద్ర అవసరం. ఇది మీ ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం ఇస్తుంది.

స్టామినా పెరుగుతుంది..

రోజూ సోపు పాలు తాగితే.. స్టామినా పెరుగుతుంది. సోపు కండరాలను బలోపేతం చేస్తుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ పాలు తాగితే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి.

ఎముకలు స్ట్రాంగ్‌ అవుతాయి..

ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. పాలలో ప్రోటీన్, కాల్షియం ఉంటుంది. దీనికి సోంపు కలపడం వల్ల పానీయానికి ఆరోగ్యకరంగా తయారువుతుంది. సోంపులో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇది దంతాలు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *