Budget 2024 Expectations In Jobs: దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో నిరుద్యోగం ప్రధానమైంది. దీని కారణంగానే యువతలో అసహనం అసంతృప్తి పెరిగిపోతోంది. ప్రైవేటు సెక్టార్‌లో మంచి ఆఫర్లు ఉన్నప్పటికీ దానికి సరిపడా స్కిల్స్ లేకపోవడంతో ఉద్యోగ వేటలో చాలా మంది యువత వెనకుబడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు చేయడం కంటే ఏదో బిజినెస్‌, వ్యాపారం పెట్టుకొని పది మందికి ఉద్యోగం కల్పించాలనే ఆలోచన ఎక్కువమందిలో కనిపిస్తోంది. ఈ కారణాలు బడ్జెట్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టేలా చేస్తున్నాయి. 

ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై భారీ ఆశాలు

ఎన్నికల ఏడాదిలో పెట్టే బడ్జెట్‌ ఎప్పుడూ పెద్ద ఇంపాక్ట్ చూపదు. కానీ మారిన పరిస్థితులు, రాజకీయ సమీకరణాల కారణంగా బడ్జెట్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగ కల్పన, నైపుణ్యాల అభివృద్ధి, ఆంట్రెపెన్యూర్‌షిప్‌ ఇలాంటి వాటిపై జెడ్‌ జనరేషన్‌ భారీగా ఆశలు పెట్టుకుంది.

పీఎల్‌ఐ స్కీమ్‌పై ఫోకస్

ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్న సెక్టార్లపై ఈసారి తాత్కాలిక బడ్జెట్‌ దృష్టి పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నిరుద్యోగత పెరిగిపోతున్న టైంలో వారికి సరైన దారి చూపేందుకు వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాంటి సెక్టార్లకు ప్రొడెక్షన్ లింక్డ్‌ ఇన్సెటివ్ స్కీమ్‌ ద్వారా చేయూత ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

14 సెక్టార్లు ఉన్న ప్రయోజనం అంతంతే

ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు కల్పించే గార్మెంట్స్, జ్యూవెలరీ, హ్యాండిక్రాఫ్ట్స్‌ లాంటి విభాగాలకు పీఎల్‌ఐ స్కీమ్‌లు మరింతగా ఇంప్లిమెంట్‌ చేయనున్నారు. ప్రస్తుతం స్కీమ్‌లో 14 విభాగాలు ఉన్నాయి. అందులో చాలా వరకు అనుకున్న స్థాయిలో ఉద్యోగాల కల్పన చేయలేకపోతున్నాయి. అందుకే వాటిలో మార్పులు చేర్పులు ఖాయంగా కనిపిస్తోంది. 

మరికొన్ని జోడించే ఛాన్స్‌ 

ముఖ్యంగా మహిళల ఆదాయం పెంచేందుకు పీఎల్‌ఐ స్కీమ్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో ఉన్న కంపెనీల్లో చాలా వరకు ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యాయి. అందుకే వీటిని రివైజ్ చేసి మరికొన్ని సెక్టార్లను ఇందులో చేర్చనున్నారు. లెథర్, గార్మెంట్, జ్యూవెలరీ, హ్యాండీక్రాఫ్ట్‌ లాంటి భారీగా ఉద్యోగాలు అందించే విభాగాలను చేరిస్తే పథకం అసలు లక్ష్యం నెరవేరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

రిమోట్‌, ఫ్రీలాన్స్‌ జాబ్స్‌పై కూడా ఫోకస్ 

కరోనా తర్వాత వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. చాలా కంపెనీలు రిమోట్‌ పనికే ప్రాధాన్యత ఇస్తన్నాయి. దీన్ని దృష్టి పెట్టుకొని కూడా కొన్ని వెసులుబాటులు కల్పించాల్సి ఉంటుందని నిపుణులు, యువత ఆలోచనగా ఉంది. అదే టైంలో ఫ్రీలాన్స్ ఉద్యోగాలపైవు కూడా యువత దృష్టి పెట్టింది. దీని వల్ల కూడా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే మంచిదని అంటున్నారు. 

ఇల్లు కొనాలనే ఆలోచన పక్కకు

భారీగా పెరిగిపోతున్న ఇంటి కనుగోలు అంశంపై కూడా దృష్టి పెట్టాలని యువత కోరుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఫైనాన్స్‌ ఫొజిషన్‌లోనే ప్రభుత్వ సాయంతో ఇంటిని కొనుక్కోవాలని ఆశిస్తోంది. రియల్‌ఎస్టేస్ నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఓ ప్రాజెక్టు ప్రారంభించాలంటే… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 30కిపైగా అనుమతు కావాల్సి ఉంది. దీని కారణంగా ప్రాజెక్టు ఆలస్యమై రేట్లు పెరిగిపోతున్నాయని వారి వాదన. దీనికి ఒక సింగిల్ విండో సిస్టమ్‌ ఉంటే కచ్చితంగా ఇన్‌టైంలో అనుమతులు వస్తాయని చెబుతున్నారు. అందరికీ ఇళ్లు అనే కాన్సెప్టులో దీన్ని ఆలోచించి త్వరగా ఇంటి నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలని యువతరం అభ్యర్థిస్తోంది. Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *