PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ యోగాసనాలు ప్రాక్టిస్‌ చేస్తే.. అర్థరైటిస్‌ నొప్పి దూరం అవుతుంది..!

[ad_1]

Yoga asanas to ease arthritis: కాసేపు కుర్చీలో కూర్చుని మళ్లీ లేవాలంటే కష్టంగా ఉంటుంది. కొంచెం దూరం నడవాలన్నా నరకంగా ఉంటుంది. కీళ్లన్నీ బిగుసుకుపోయి ఉంటాయి. ఈ సమస్యనే ఆర్థరైటిస్‌ అంటారు. ఆర్థరైటిస్‌ అంటే ఎముకలు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. అర్థరైటిస్‌లో 200 రకాల కంటే ఎక్కువే ఉంటాయి. అయితే ఇందులో ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్‌ స్పాండైల్‌ ఆర్థరైటిస్, గౌట్, జువెనైల్‌ ఇడియోఫథిక్‌ ఆర్థరైటిస్‌ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కీళ్ల దగ్గర నొప్పి, వాపు, కీళ్లు స్టిఫ్‌గా మారడం.. వీటన్నింటిలో కనిపించే సాధారణ లక్షణం. చలికాలంలో.. అర్థరైటిస్‌ నొప్పి తీవ్రంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్‌ శరద్‌ కులకర్ణి అన్నారు. అర్థరైటిస్‌ పేషెంట్స్‌ వారి డైట్‌లో వేడి స్వాభావం ఉన్న ఆహారం తీసుకుంటే ఈ నొప్పి నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని అన్నారు. రోజు స్నానం చేసే ముందు గోరువెచ్చని నూనెతో నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో మర్దన చేసుకుంటే మంచిదని సూచించారు. అర్థరైటిస్‌తో బాధపడేవారు వేడి నీటితోనే స్నానం చేయాలని అన్నారు. అర్థరైటిస్‌ పేషెంట్స్‌ ఈ కాలంలో ప్రతి రోజూ ప్రాణాయమం, ధ్యానం, 30 నిమిషాల పాటు తేలికపాటి యోగాసనాలు వేస్తే.. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించవచ్చని అన్నారు. అర్థరైటిస్‌ నొప్పిని తగ్గించే ఆసనాలు ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

వీరభద్రాసనం..

రోజూ వీరభద్రాసనం ప్రాక్టిస్‌ చేయడం వల్ల.. చేతులు, కాళ్లు, వీపు కింది భాగాలు బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ భంగిమ భుజాలను దృఢంగా మారుస్తుంది. అర్థరైటిస్‌ సమస్యతో బాధపడేవారికి.. వీరభద్రాసనం ఉపశమనం కలిగిస్తుంది.

మార్జారాసనం..

రోజూ మార్జారాసనం ప్రాక్టిస్‌ చేస్తే.. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫ్లెక్సిబిలిటీతో పాటు కీళ్లలో బలం వస్తుంది. అందుకే ఆర్థరైటిస్‌తో బాధపడేవారు.. ఈ ఆసనం వేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఎలా వేయాలి..

ఈ ఆసనం వేయడానికి రెండు చేతులను గడ్డం కింద ఉంచుకుని బోర్లాపడుకుని విశ్రాంతి స్థితిలో ఉండాలి. రెండు అరచేతులను నేల మీద ఉంచి మోకాళ్ల మీద లేవాలి. ఈ స్థితిలో చేతులు నిటారుగా ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ వీపును కిందకు వంచి తలను పెకైత్తాలి. తర్వాత శ్వాస వదులుతూ వీపును పైకి లేపుతూ తలను కిందికి వంచి నాభిని చూడాలి. ఇలా రోజూ పదిసార్లు చేసిన తర్వాత బోర్లా పడుకుని విశ్రాంతి తీసుకోవాలి.

త్రికోణాసనం..

త్రికోణాసనం వెన్నునొప్పిని తగ్గించడానికి, కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వెన్నునొప్పి, సయాటికా సమస్యను తగ్గించడానికి ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. వెన్నెముక, చేతులు, ఛాతీని సాగదీస్తుంది, బలపరుస్తుంది.

ఎలా వేయాలి..

పాదాలను దూరంగా పెట్టి నిల్చొని, చేతులను రెండు వైపులకు చాచాలి. డీప్‌ బ్రీత్‌ తీసుకోవాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ తుంటి నుంచి శరీరాన్ని కుడివైపునకు వంచాలి. నడుము తిన్నగా ఉండాలి. ఎడమ చేయిని పైకెత్తి, కుడి చేతిని కుడి పాదానికి తాకించాలి. చేతులు రెండూ ఒకే వరుసలో ఉండేలా చూసుకోవాలి. తల కుడివైపునకు తిప్పి, ఎడమ చేయిని చూడాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఆ తర్వాత.. మరోవైపున ఇలాగే చేయాలి.

వృక్షాసనం..

వృక్షాసనం వెన్నుపూసను, కాళ్లను బలపరుస్తుంది. సమతుల్యతను కూడా మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం అర్థరైటిస్‌ పేషెంట్స్‌కు చాలా ఉపయోగపడుతుంది.

ఎలా వేయాలి..

కాళ్ల మధ్య రెండు ఇంచుల దూరం ఉంటాలి. ఎదురుగా ఏదో ఒక వస్తువుపైన దృష్టిని కేంద్రీకరించాలి. గాలిని బిగబట్టి కుడికాలి పాదాన్ని ఎడమ కాలి తొడపై వేసుకోవాలి. గాలిని వదులుతూ రెండు చేతులను పైకి గాల్లోకి నమస్కార ముద్రలో లేపాలి. 10-30 సెకన్ల పాటు ఇలా ఉంటూ సాధారణ స్థితిలో గాలిని పీల్చుకోవాలి. అనంతరం గాలిని మెల్లగా వదులుతూ చేతులను కిందకు దించాలి. పాదాన్ని కూడా సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇదే విధంగా ఎడమ కాలి పాదాన్నీ కుడి తొడపైకి తీసుకొచ్చి, చేతులను నమస్కార ముద్రలోకి తెచ్చి ఆసనాన్ని పూర్తి చేయాలి.

భుజంగాసనం..

భుజంగాసనం వెన్నును బలపరుస్తుంది. అర్థరైటిస్‌ పేషెంట్స్‌ ఈ ఆసనం వేస్తే.. కొంత ఉపశమనం లభిస్తుంది.

ఎలా వేయాలి..

బోర్లా పడుకొని శరీరం మొత్తాన్ని పూర్తిగా సాగదీయాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు నేలకు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీ పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతీని పైకి లేపాలి. మోచేతులు నేలకు ఆని ఉండేలా చూసుకోవాలి. కొద్దిసేపయ్యాక శ్వాసను వదులుతూ తిరిగి మామూలు స్థితికి రావాలి.

ఈ ఆసనాలూ మేలు చేస్తాయి..

సేతుబంధాసనం, వజ్రాసనం, ఆంజనేయాసనం, కుక్కుతాసనం కూడా ఆర్థరైటిస్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తాయిని నిపుణులు చెబుతున్నారు. కానీ మీకు వెన్ను, నడుము, భుజాలలో నొప్పి ఉంటే ఈ ఆసనాలను ప్రాక్టిస్‌ చేయవద్దు. అలాగే, ఏదైనా యోగాసనాన్ని ప్రారంభించే ముందు, మీ వైద్యుడిని సంప్రదించండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *