PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ L&T, Tata Steel, Hero Moto

[ad_1]

Stock Market Today, 01 November 2023: యుఎస్ ఫెడ్ సమావేశం నేపథ్యంలో పెట్టుబడిదార్లు జాగ్రత్తగా ఉండటంతో ఇండియన్‌ ఈక్విటీస్‌ రెండు రోజుల లాభాల తర్వాత మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఫెడ్‌ ఔట్‌కమ్‌ ఈ రోజు సాయంత్రం వస్తుంది, దాని ప్రభావం రేపు మన మార్కెట్‌ మీద ఉంటుంది.

US స్టాక్స్ అప్
ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానం అప్‌డేట్‌ కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తుండడంతో వాల్ స్ట్రీట్ ప్రధాన సూచికలు మంగళవారం సెషన్‌ను లాభాలతో ముగించాయి. మిశ్రమంగా వస్తున్న కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ను కూడా అక్కడి మార్కెట్‌ జీర్ణించుకుంటోంది. 

పెరిగిన ఆసియా షేర్లు
ఫారెక్స్‌లో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ చీఫ్ చెప్పడంతో, ఈ సంవత్సరం బలహీన స్థాయి నుంచి యెన్ బలపడింది. వాల్ స్ట్రీట్‌లో లాభాలతో ఆసియా షేర్లు బలంగా ఓపెన్‌ అయ్యాయి.

ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 10 పాయింట్లు లేదా 0.05 శాతం రెడ్‌ కలర్‌లో 19,130 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, బ్రిటానియా, హీరో మోటో, అదానీ విల్మార్, అంబుజా. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

L&T: 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో ఎల్‌ అండ్‌ టీ రూ.3,223 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన (YoY) ఇది 45% పెరిగింది.

పతంజలి ఫుడ్స్: ఎక్స్ఛేంజ్ సర్క్యులర్ ప్రకారం, పతంజలి ఫుడ్స్ నవంబర్ 1 ‍‌(ఈ రోజు) నుంచి అడిషనల్‌ సర్వైలాన్స్‌ మీజర్‌ (ASM) ఫ్రేమ్‌వర్క్ నుంచి బయటకు వస్తుంది.

ఎయిర్‌టెల్: టెలికాం మేజర్ భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ లాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 37% తగ్గి రూ.1,341 కోట్లకు పరిమితమైంది.

టాటా కన్జ్యూమర్‌: టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జులై-సెప్టెంబర్ కాలంలో రూ.338 కోట్ల ఏకీకృత నికర లాభంతో 3% గ్రోత్‌ను రిపోర్ట్‌ చేసింది.

అదానీ టోటల్ గ్యాస్: సెప్టెంబర్‌ క్వార్టర్‌లో అదానీ టోటల్ గ్యాస్ కన్సాలిడేట్‌ నెట్‌ ప్రాఫిట్‌ 8% వార్షిక (YoY) వృద్ధిని నమోదు చేసి రూ.173 కోట్లకు చేరుకుంది.

నవీన్ ఫ్లోరిన్: Q2 FY24లో నవీన్ ఫ్లోరిన్ రూ.60 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా కంపెనీ రూ.472 కోట్ల ఆదాయం వచ్చింది.

అమర రాజా బ్యాటరీస్‌: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ నికర లాభం 6% పెరిగి రూ.214 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో ఆదాయం 4% పెరిగి రూ.2,811 కోట్లకు చేరుకుంది.

JSW ఎనర్జీ: ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ప్రశాంత్ జైన్ JSW ఎనర్జీ MD & CEO పదవికి రాజీనామా చేశారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఏయే పనుల కోసం GPF అడ్వాన్స్ తీసుకోవచ్చు, విత్‌డ్రా రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *