ఉందిలే మంచీ కాలం..!!

[ad_1]

News

oi-Chandrasekhar Rao

|

ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర భారీగా తగ్గింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 76.82 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో ఈ ధర 71.59 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. శనివారం నాటితో పోల్చుకుంటే ఈ రెండు చోట్లా క్రూడ్ ధర భారీగా తగ్గింది. నాలుగు అయిదు డాలర్ల మేర ఈ తగ్గుదల కనిపించింది.

క్రూడాయిల్ రేటు తగ్గినప్పటికీ- దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఏ మాత్రం పడట్లేదు. వాటి ధరలు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఇది కాస్త వాహనదారుల్లో తీవ్ర అసహనానికి, అసంతృప్తికి దారి తీస్తోంది. చాలారోజులుగా క్రూడాయిల్ బ్యారెల్ ధర భారీగా తగ్గుతూ వస్తోన్నప్పటికీ- దానికి అనుగుణంగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను సవరించట్లేదంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ పోస్ట్ చేస్తోన్నారు.

 ఉందిలే మంచీ కాలం..!!

దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అంశాన్ని పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిస్థితుల మధ్య ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే పెట్రోల్, డీజిల్ రేట్లను జారీ చేశాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.

కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది.

 ఉందిలే మంచీ కాలం..!!

అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. ఫలితంగా అక్కడ వాటి రేట్లు మరింత తగ్గుముఖం పట్టాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వ్యాట్‌ను తగ్గించింది.

English summary

Petrol, Diesel prices on December 11, 2022: Know latest fuel prices in your city after unchanged

Petrol, Diesel prices on December 11, 2022: Know latest fuel prices in your city after unchanged.

Story first published: Sunday, December 11, 2022, 8:38 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *