[ad_1]
జీర్ణక్రియకు మంచిది..
ఉలవల్లోని కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఉలవలు మన డైట్‌లో చేర్చుకుంటే.. జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణవ్యవస్థ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఉలవలు ఆకలిని పెంచుతాయి. పిల్లలకు ఉలవులు పెడితే మంచిది.
షుగర్ పేషెంట్స్‌కు మంచిది..
ఉలవల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషంట్స్ తరచుగా ఉలవలు తీసుకుంటే మంచిది. దీనిలో ఆల్ఫా-అమైలేస్ ఇన్హిబిటర్ ఉంటుంది. ఇది సీరం గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ కరుగుతుంది..
ఉలవల్లో ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ కరగడానికి సహాయపడుతుంది. ఉలవలు లితోజెనిక్ బైల్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. అందుకే ఇది యాంటీలిథోజెనిక్‌గా పని చేస్తుంది. అంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని తీసుకుంటే.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి..
ఉలవలు తరచుగా తీసుకుంటే.. కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. కీళ్ల నొప్పులూ, ఇతరత్రా ఎముక సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారూ, మహిళలూ, పిల్లలూ వీటిని కనీసం రెండు చెంచాలైనా తీసుకుంటే రోజువారీ అవసరాలకు సరిపడా క్యాల్షియం శరీరానికి అందుతుంది. ఎముకలకు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. గాయాలు త్వరగా మానడానికి ఉలవలు తోడ్పడతాయి.
యాంటీ- మైక్రోబియల్..
ఉలవల్లో యాంటీ- మైక్రోబియల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. గ్రామ్-పాజిటివ్, గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది బాసిల్లస్ సబ్టిలిస్, స్టెఫిలోకాకస్ ఆరియస్, ఎస్చెరిచియా కోలి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
నెలసరి సమస్యలకు చెక్..
నెలసరి సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లూ, ఖనిజ లవణాలూ… చర్మాన్నీ, జుట్టునీ ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువూ అదుపులో ఉంటుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply