News
lekhaka-Bhusarapu Pavani
House
prices:
సొంతిల్లు
అనేది
ప్రతి
మధ్యతరగతి
కుటుంబం
కల.
ఇప్పటికే
అభివృద్ధి
చెందిన,
చెందుతున్న
నగరాలు,
పట్టణాల్లో
స్థిర
నివాసం
ఏర్పరచుకోవాలని
ఆరాటపడుతుంటారు.
అయితే
అదేమీ
అంత
తేలిక
కాదు.
డెవలప్‌మెంట్
కి
తగ్గట్లుగానే
ధరలు
సైతం
మోత
మోగిపోతూ
ఉంటాయి.
ఈ
కోణంలో
చూస్తే
దేశ
ఆర్థిక
రాజధాని
ముంబై..
ప్రపంచంలోని
టాప్
10
నగరాల్లో
చోటు
దక్కించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా
46
నగరాల్లోని
హై
ఎండ్
నివాస
ప్రాపర్టీల
వార్షిక
ధరల
పెరుగుదల
పరంగా
5.5
శాతంతో
ముంబై
ఆరవ
స్థానంలో
నిలిచింది.
ఈ
మేరకు
రియల్
ఎస్టేట్
కన్సల్టెంట్
నైట్
ఫ్రాంక్
ఇండియా
తన
నివేదికలో
పేర్కొంది.
‘ప్రైమ్
గ్లోబల్
సిటీస్
ఇండెక్స్
Q1
2023’గా
పిలవబడే
ఈ
లిస్టులో..
2023
జనవరి-మార్చిలో
ముంబై,
బెంగళూరు
మరియు
న్యూఢిల్లీ
సగటు
వార్షిక
ధరల్లో
మంచి
పెరుగుదలను
నమోదు
చేశాయని
పేర్కొంది.

“హై-ఎండ్
లేదా
ప్రైమ్
ప్రాపర్టీలలో
వార్షిక
వృద్ధి
ఆధారంగా
గతేడాది
Q1లో
38వ
ర్యాంక్
నుంచి
ఈ
దఫా
Q1
నాటికి
ఆరవ
ర్యాంకుకు
ఎగబాకింది”
అని
కన్సల్టెంట్
ఒక
ప్రకటనలో
తెలిపారు.
2022
సంవత్సరం
మొదటి
త్రైమాసికంలో
బెంగళూరు
మరియు
న్యూఢిల్లీ
కూడా
ఇండెక్స్
ర్యాంకింగ్‌లో
37,
39
ర్యాంకుల్లో
ఉండగా..
ఇప్పుడు
వరుసగా
16
మరియు
22వ
స్థానాలు
సాధించాయి.
ముంబైలో
సగటు
ధరల
పెరుగుదల
సంవత్సరానికి
5.5
శాతం(YoY)గా
నమోదైంది.
2022
Q1తో
పోలిస్తే
బెంగళూరులో
ఇది
3
మరియు
న్యూఢిల్లీలో
1.2
శాతం
మాత్రమేనని
నైట్
ఫ్రాంక్
పేర్కొంది.
అయితే
ప్రైమ్
రెసిడెన్షియల్
ప్రాపర్టీస్
విలువలో
44.2%
పెరుగుదలతో
దుబాయ్
ప్రపంచంలోనే
అగ్రస్థానాన్ని
కైవసం
చేసుకుంది.
“2022లో
ప్రపంచాభివృద్ధి
మరియు
ద్రవ్యోల్బణం
గురించి
అంతటా
ఆందోళనలు
ఉన్నప్పటికీ
భారత
ఆర్థిక
వ్యవస్థ
స్థిరమైన
పనితీరు
కనబరిచింది”
అని
నైట్
ఫ్రాంక్
ఇండియా
CMD
శిశిర్
బైజాల్
తెలిపారు.
ఓ
వైపు
ద్రవ్యోల్బణ
వాతావరణం
ఉన్నా,
దేశీయ
రియల్
ఎస్టేట్
మార్కెట్లలో
నిరంతరం
డిమాండ్‌లో
ఊపందుకుంటున్నట్లు
చెప్పారు.
గత
ఏడాదిగా
గృహ
రుణాల
రేట్లు
బాగా
పెరిగాయని
గుర్తు
చేశారు.
English summary
Mumbai stood in 6th place among 46 global cities annual housing price growth
Mumbai stood in 6th place among 46 global cities annual housing price growth
Story first published: Tuesday, May 16, 2023, 7:18 [IST]