[ad_1]
AP Budget 2024: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తన ఆఖరి బడెజ్ట్‌ను ప్రవేశ పెట్టేసింది. ప్రస్తుతం ఆఖరి బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సభలో ప్రవేశ పెట్టారు. రెండు నెలల్లో ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రభుత్వ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.
ఇవాళ సభలో బుగ్గన ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్రధానాంశాలు పరిశీలిస్తే… ప్రభుత్వ నడవడానికి అనుకూలంగా ఉండేలా ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. వార్షిక బడ్జెట్‌ను రూ.2లక్షల 86వేల 389కోట్లుతో సభ ముందుకు తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లుగా చూపించారు. మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లుగా చెప్పారు. ద్రవ్యలోటు రూ.55వేల 817కోట్లు ఉన్నప్పుట పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం ఉంటే… జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51శాతం ఉంది.
గాంధీజీ, అబ్రహం లింకన్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన ధ్యేయంగా జగన్ మోహన్ రెడ్డిపాలిస్తున్నారని చెప్పుకొచ్చారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఏడు ప్రధాన లక్ష్యాలతో తమ ఐదేళ్ల పాలన సాగిందన్నారు బుగ్గన. వాటిలో సాధించిన విజయాలను సభలో వివరించారు.
బుగ్గన చెప్పిన ఏడు భాగాలుగా పాలనా విధానాలు ఇవే.. రాష్ట్రాన్ని సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళ, మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్రగా మార్చాలన్న ధ్యేయంతో పాలన సాగించినట్టు పేర్కొన్నారు.
సుపరిపాలన ఆంధ్ర
పాలనా వికేంద్రీకరణ- గడప వద్దకే పాలన అన్న కాన్సెప్టులో ప్రజల సాధికారత, వికేంద్రీకరణ సుపరిపాలనకు ముఖ్యమైనవి. వీటిని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు చాలా చర్యలు తీసుకున్నాం. గ్రామస్థాయి నుంచి పాలన పటిష్ట పరచడానికి చర్యలు తీసుకున్నాం. వికేంద్రీకరణలో భాగంగా పోలీసు, జిల్లా పునర్వవస్థీకరణే కాకుండా మరెన్నో చర్యలు తీసుకున్నాం.
2023-24 సంవత్సరానికి సవరించిన అంచనాలు
2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయం కోస సంవరించిన అంనచాలు 2,28,237,77 కోట్లు అయితే మూల ధన వ్యయం కోసం 27,308.12 కోట్లు, రెవెన్యూ లోటు దాదాపు 31,534.94 కోట్లు, అదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు 60,153.59 కోట్లు, ఇది జీఎస్‌డీపీలో వరుసగా 2.19 , 4.18 శాతంగా ఉన్నాయి.
మరిన్ని చూడండి
[ad_2]
Source link