ఐటీఆర్‌-1 ఎవరు ఫైల్‌ చేయకూడదు?, మీరు ఈ పరిధిలో ఉన్నారో, లేదో చెక్‌ చేసుకోండి

[ad_1]

Income Tax Return Filing 2024: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY 2023-24) మరో 50 రోజుల్లో ముగుస్తుంది. సాధారణంగా, ఇన్‌కమ్‌ టాక్స్‌ రూల్స్‌ (Income Tax Rules) ప్రకారం రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి ఏటా జులై 31 వరకే టైమ్‌ ఇస్తారు. ఈ గడువు తర్వాత ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలంటే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. 

ఆదాయ పన్ను ఫైలింగ్‌ కోసం ఎక్కువ మంది ఎంచుకునే ఫామ్‌ ITR-1. సర్వసాధారణంగా, జీతభత్యాల ద్వారా ఆదాయం సంపాదించేవాళ్లు దీనిని ఎంచుకుంటారు. ఐటీఆర్-1 ఫారాన్ని సహజ్ ఫామ్‌ అని కూడా అంటారు.

ఐటీఆర్‌-1 ఫామ్‌ ఫైల్‌ చేసేందుకు ఎవరు అర్హులు? ‍‌(Who is eligible to file ITR-1 form?)

సాధారణ పన్ను చెల్లింపుదార్లు ITR-1 ఫారం ద్వారా తమ ఆదాయం, పన్ను బాధ్యతను ప్రకటిస్తారు. జీతం, డివిడెండ్, బ్యాంకు వడ్డీ, ఒక ఇంటి ఆస్తి, వ్యవసాయం ద్వారా వార్షిక ఆదాయం రూ. 5000 మించని వ్యక్తి ‍‌(individual), ఐటీఆర్‌ ఫైలింగ్‌ సమయంలో ఈ ఫారాన్ని ఎంచుకోవాలి. వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్న టాక్స్‌ పేయర్లు ఈ ఫామ్‌ ద్వారా రిటర్న్‌ సమర్పించవచ్చు.

ఐటీఆర్‌-1 ఫారం ఎవరి కోసం కాదు? ‍‌(Who is not eligible to file ITR-1 form?)

టాక్స్‌ పేయర్‌ పన్ను చెల్లించదగిన ఆదాయం రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అతను ITR-1 ఫారం ద్వారా రిటర్న్‌ ఫైల్‌ చేయకూడదు. 

ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్, బంగారం, ఈక్విటీ షేర్లు, ఇతర వనరుల నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తే, అతను ITR-1 ఎంచుకోకూడదు.

గుర్రపు పందాలు, లాటరీలు, చట్టబద్ధమైన జూదం వంటి ఆస్తి లేదా సేవల నుంచి ఒక వ్యక్తి ఆదాయం సంపాదించినట్లయితే, అతను కూడా ITR-1 ఫైల్ చేయడానికి అర్హుడు కాదు.

ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తుల ద్వారా ఆదాయం వస్తుంటే, అతను కూడా ITR-1 ఫైల్ చేయలేడు.

NRI (Non-Resident Indian) కూడా ITR-1 ఫైల్ చేయడానికి అర్హుడు కాదు.

బ్యాంక్ నుంచి నగదు విత్‌డ్రా చేస్తున్నప్పుడు, ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 194N ప్రకారం TDS (Tax Deducted at Source) కట్‌ అయితే, అలాంటి టాక్స్‌ పేయర్‌ ITR-1 ఫామ్‌ ఉపయోగించకూడదు. 

హిందు అవిభక్త కుటుంబం (HUF), సంస్థలు/కంపెనీలు కూడా ITR-1ని ఫైల్ చేయకూడదు.

అర్హత లేనప్పటికీ ITR-1 ఫైల్ చేస్తే ఏమవుతుంది?

ITR-1 ఫైల్ చేయడానికి అర్హత లేని వ్యక్తి పొరపాటున అదే ఫారం ద్వారా తన ఆదాయ వివరాలు ప్రకటిస్తే, ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసు ‍‌(Income Tax Department Notice) రావచ్చు. అయితే, భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు ఫారం ఫైల్‌ చేశారని మాత్రరే ఆ నోటీసులో ఉంటుంది. అప్పుడు, IT నోటీసు అందిన తేదీ నుంచి 15 రోజుల లోపు ఆ అసెసీ మళ్లీ సరైన ఫారాన్ని దాఖలు చేయాలి. లేకపోతే, మొదట పంపిన ITR చెల్లకుండా పోతుంది. ఆ తర్వాత, ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరో ఆసక్తికర కథనం: రిటర్న్‌ ఫైలింగ్‌లో పాత పద్ధతి బెటరా, కొత్త పద్ధతి బెటరా? సింపుల్‌గా డిసైడ్‌ చేయొచ్చు

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *