PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఒక్కసారే ₹1000 తగ్గిన వెండి, బంగారం కూడా శాంతిస్తోంది

[ad_1]

Gold-Silver Price 17 December 2022: బంగారం, వెండి ధరలు ఇవాళ కొద్దిగా చల్లబడ్డాయి. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 290, స్వచ్ఛమైన పసిడి ₹ 310 చొప్పున దిగి వచ్చాయి. 24 కేరెట్ల బంగారం ధర ఇప్పటికీ ₹54 వేల పైనే ఉంది. కిలో వెండి ధర ఒకేసారి ₹ 1,000 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,700 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 54,220 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 72,500 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 49,700 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 54,220 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 72,500 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

News Reels

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today’s Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 50,450 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 55,040 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,220 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,380 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,750 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,280 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,750 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,280 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,220 గా ఉంది.

ప్లాటినం ధర (Today’s Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం ‘ప్లాటినం’ ధర 10 గ్రాములకు ₹ 930 పెరిగి ₹ 27,460 గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *