PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

కుప్పకూలిన US బ్యాంకుల్లో కామన్ ఫ్యాక్టర్.. మూడు బ్యాంకులనూ ఆడిట్ చేసింది ఒకే సంస్థ..


News

lekhaka-Bhusarapu Pavani

|

ప్రపంచ
పెద్దన్న
అమెరికాలో
ఇటీవల
బయటపడిన
బ్యాంకుల
వైఫల్యాలు..
ఇతర
దేశాలను
కంటి
మీద
కునుకు
లేకుండా
చేస్తున్నాయి.
తమ
ప్రాంతాల్లోని
ఆర్థిక
సంస్థల
సామర్థ్యాన్ని,
డొల్ల
తనాన్ని
పలు
దేశాలు
లెక్కలు
వేసుకుంటున్నాయి.
అయితే
USలో
గత
రెండు
నెలల్లోనే
3
బ్యాంకులు
వైఫల్యం
చెందడాన్ని
లోతుగా
గమనిస్తే,
వాటి
మధ్య

ఉమ్మడి
విషయం
ఉన్నట్లు
నిపుణులు
పేర్కొంటున్నారు.

USలోని
సిలికాన్
వ్యాలీ
బ్యాంక్,
సిగ్నేచర్
బ్యాంక్
మరియు
ఫస్ట్
రిపబ్లిక్
బ్యాంక్
విఫలమైన
ఉదంతంలో

సంస్థ
కామన్
గా
కనిపిస్తోందని
UKకు
చెందిన
ప్రముఖ
మీడియా
సంస్థ
నివేదించింది.
ఆయా
బ్యాంకుల
ఆర్థిక
నివేదికలకు
ఫిబ్రవరి
చివరి
నాటికి
ఆడిటర్
KPMG
క్లీన్
సర్టిఫికేషన్
ఇచ్చినట్లు
తెలిపింది.
వెల్స్
ఫార్గో,
సిటీ
గ్రూప్,
బ్యాంక్
ఆఫ్
న్యూయార్క్
మెల్లన్
తో
పాటు
దాదాపు
40
లిస్టెడ్
బ్యాంకులకు
ఇదే
సంస్థ
ఆడిటర్‌గా
వ్యవహరిస్తున్నట్లు
వెల్లడించింది.
ఫెడరల్
రిజర్వ్‌
ను
సైతం
ఆడిట్
చేస్తుందని
పేర్కొంది.

కుప్పకూలిన US బ్యాంకుల్లో కామన్ ఫ్యాక్టర్.. మూడు బ్యాంకులనూ

KPMG
LLP
తన
ఆడిట్
నివేదికపై
సంతకం
చేసిన
14
రోజులకే
సిలికాన్
వ్యాలీ
బ్యాంకు,
11
రోజుల
తర్వాత
సిగ్నేచర్
బ్యాంక్
కుప్పకూలినట్లు
మీడియా
సంస్థ
గుర్తుచేసింది.
ఫిబ్రవరి
24న
SVB
గ్రూపు
ఆడిటింగ్
పూర్తి
కాగా..
నగదు
కొరత
ఏర్పడటంతో
మార్చి
10న
నియంత్రణ
సంస్థలు
బ్యాంకును
సీజ్
చేశాయి.
క్రిప్టో
పరిశ్రమలో
బూమ్
వల్ల
సిగ్నేచర్
బ్యాంకులో
డిపాజిట్లు
విపరీతంగా
పెరిగాయి.
మార్కెట్లు
నష్టాల్లోకి
జారుకోగానే
సీన్
కాస్తా
రివర్స్
అయింది.
డిపాజిట్లకు
బీమా
లేకపోవడంతో
ఏదైనా
సమస్య
వస్తే
కస్టమర్లు
తేలికగా
బయటకు
మళ్లే
అవకాశం
ఉంది.

KPMG
తప్పుడు
ప్రకటన
వల్ల
పెట్టుబడిదారుల్లో
ఆందోళన
నెలకొని
బ్యాంకు
పతనానికి
దారితీసినట్లు
కోర్టులో
దావా
ఫైల్
అయింది.
బ్యాంకు
సామర్థ్యం
గురించి
ఎటువంటి
సందేహం
లేవనెత్తకుండా
నిశ్శబ్ధంగా
ఉండటమే

గందరగోళానికి
కారణమని
అందులో
పేర్కొన్నారు.
US
ఫెడరల్
డిపాజిట్
ఇన్సూరెన్స్
కార్ప్
(FDIC)తో
JP
మోర్గాన్
చేజ్
&
కో
సోమవారం

డీల్
చేసుకుంది.
శాన్
ఫ్రాన్సిస్కో
ఆధారిత
ఫస్ట్
రిపబ్లిక్
ఆస్తులను
నియంత్రించడానికి
ఒప్పందం
కుదుర్చుకుంది.

English summary

UK’s Financial Times reported common factor on 3 US banks failure in a row

UK’s Financial Times reported common factor on 3 US banks failure in a row

Story first published: Thursday, May 4, 2023, 7:55 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *