PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

కేంద్ర బడ్జెట్‌లో మీ వాటా ఎంతో ఎప్పుడైనా ఆలోచించారా?

[ad_1]

Interim Budget 2024: కేంద్రంలోని మోదీ 2.0 ప్రభుత్వం తరపున, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌, 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి పద్దు. నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) కూడా, రికార్డ్‌ స్థాయిలో ఆరోసారి బడ్జెట్‌ ప్రకటన చేశారు, మొరార్జీ దేశాయ్ రికార్డ్‌ను సమం చేశారు. 

కొత్త పార్లమెంట్‌ భవనం నుంచి ఆర్థిక మంత్రి చేసిన బడ్జెట్‌ ప్రసంగాన్ని దేశం యావత్తు కళ్లు పత్తికాయల్లా చేసుకుని చూసింది, ఒళ్లంతా చెవులు చేసుకుని వింది. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరు టీవీలు, మొబైల్స్‌కు అతుక్కుపోయారు. సాధారణంగా, ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అంత మొత్తంలో ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అందులో మీ వాటాగా ఎంత సమకూర్చాలి అన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా?.

ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?
ముందుగా, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వానికి అందే డబ్బును రెవెన్యూ రిసిప్ట్స్ ‍‌(Revenue Receipts) అంటారు. ఇది ప్రధానంగా.. ప్రత్యక్ష & పరోక్ష పన్నుల ద్వారా పొందే ఆదాయమై ఉంటుంది. 

వ్యక్తిగత ఆదాయపు పన్ను (Individual Income Tax), ప్రైవేట్ సంస్థల లాభాలపై వేసే పన్నులను (Corporate Tax) ప్రత్యక్ష పన్నులు అంటారు. వీటిలో మూలధన లాభాల పన్ను ‍‌(Capital gains tax), సంపద పన్ను (Wealth tax) కూడా కలిసి ఉంటాయి. పరోక్ష పన్నుల విభాగంలో… GST, వ్యాట్‌ (VAT) ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకం, సేవల పన్ను వంటివి ఉంటాయి.

బడ్జెట్‌లో మీ వాటా ఎంత?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయం, కార్పొరేట్ పన్నుల వసూళ్లు గత పదేళ్లలో రూ. 19 లక్షల కోట్లకు పైగా పెరిగాయి. ప్రజల ఆదాయం పెరగడం వల్ల, రిఫండ్‌లు సర్దుబాటు చేసిన తర్వాత మిగిలిన ‘నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు’ ‍‌(Net direct tax collections) 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 6.38 లక్షల కోట్ల నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 16.61 లక్షల కోట్లకు పెరిగాయి. 2023-24లో స్థూల నెలవారీ జీఎస్టీ వసూళ్లు ‍‌(Gross monthly GST collections) రూ. 1.66 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. 

కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న డబ్బంతా గాల్లోంచి పుట్టుకుని రావడం లేదు. ప్రత్యక్ష & పరోక్ష పన్నుల (Direct Taxes & Indirect Taxes) రూపంలో.. మీరు, నేను, ప్రజలంతా కలిసి కడుతున్న డబ్బే ఇది. కారప్పొడి నుంచి కారు వరకు, ఇడ్లీ రవ్వ నుంచి ఇంటి వరకు.. ఏది కొన్నా, ప్రతి దాంట్లో మనం గవర్నమెంట్‌కు టాక్స్‌లు కడుతున్నాం. ఏటా ఆదాయ పన్ను, సంపద పన్ను అంటూ వివిధ రూపాల్లో సర్కారుకు చెల్లించుకుంటూనే ఉన్నాం. ఆ డబ్బునే సర్కారు బడ్జెట్‌లో వివిధ అభివృద్ధి & సంక్షేమ పథకాల కోసం కేటాయిస్తుంది. 

2024-25 ఆర్థిక సంవత్సరం కోసం వేసిన బడ్జెట్‌లోనూ.. కొత్త ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాల అంచనాలు ఉంటాయి. అంటే, ప్రజల నుంచి ఈ ఏడాది ఇంత మొత్తం వసూలు అవుతుందన్న అంచనా కేంద్ర పద్దులో ఉంటుంది. ఆ మేరకు మనం చెల్లించుకోవాల్సి వస్తుంది.

మరో ఆసక్తికర కథనం: ‘ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితం’ – బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

మరిన్ని చూడండి

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *