PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

కేటాయింపులు ఘనం- ఖర్చులు శూన్యం- బీఆర్‌ఎస్‌ పాలనపై భట్టి సెటైర్లు

[ad_1]

Bhatti Vikramarka On BRS GOVT: తెలంగాణ బడ్జెట్ తొలిసారి ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గత పాలకులను తూర్పార బట్టారు. పదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన పాలకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ద్వంసం చేశారని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని నిరు పేద అప్పులు రాష్ట్రంగా మార్చేశారని విమర్శలు చేశారు. అంతేకాకుండా బడ్జెట్‌ లెక్కలు అన్ని తప్పులు తడకలుగా ఉందన్నారు.  

బడ్జెట్‌లో భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలు ఆయన మాటల్లోనే” గత పాలకుల నిర్వాకంతో మన ధనిక రాష్ట్రంలో కూడా ఆర్థిక కష్టాలు వచ్చాయి. పూట గడవడం కూడా కష్టం అనేతం కనిష్ట స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చు చేర్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనివ్వకుండా ప్రజలకు ఏ మాత్రం అవసరం లేని ఆర్భాటాలకు డబ్బు ఖర్చు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంత దురదృష్టకర పరిస్థితుల్లో ఉందంటే ప్రతి నెల 1 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీని వల్ల ఉద్యోగుల క్రెడిట్ స్కోర్ దెబ్బతినడం వల్ల వారు రుణాలు పందలేకుండా పోతున్నారు. 

అందుకే తెలంగాణ రాష్ట్ర ఆర్థికి పరిస్థితిని ప్రజల జీవితాలను దుర్భరం చేసే దిశగా సాగిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలకు చరమ గీతం పాడారు. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనం. దివాళా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఇప్పటికే దుబాబా ఖర్చులు తగ్గించాం. ఆర్థిక క్రమశిక్షణతోపాటు మెరుగైన సంక్షేమ పాలన అందించాలన్నదే మా లక్ష్యం. 

గత ప్రబుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి బడ్జెట్‌ వాస్తవానికి చాలా దూరంగా ఉంది. రాష్ట్రం రాబడిని అధికంగా చేసి చూపెట్టడం ద్వారా ఎన్నో పథకాలకు నిధులను కేటాయిస్తూ వచ్చారు. ఉదాహరణకు దళిత బంధు పథకానికి బడ్జెట్‌లో 17,700 కోట్ల రూపాయలు చూపిస్తే నిధులు మాత్రం ఒక్కపైసా ఖర్చు పెట్టలేదు. 

2021-22 సంవత్సరానికి కాగ్ లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల అభివృద్ధికి డిమాండ్‌లో 4,874 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయలేదు. గిరిజను అభివృద్ధిలో 2,918 కోట్లు రూపాయలు ఖర్చు చేయలేదు. వెనుకబడిన తరగతుల అభివృద్ధిలో 1437 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. రైతులకు వడ్డీ లేని రుణాల కోసం కేవలం 2014-15 నుంచి 2023-24 వరకు1,067 కోట్ల రూపాయలు బడ్జెట్‌ పెట్టి కేవలం 297 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. 

మహిళలకు 2014-15 నుంచి 2023-24 వరకు 7,848 కోట్ల రూపాయల బడ్జెట్‌ పెట్టి కేవలం 2,685 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు.
ఈ విధంగా సమాజంలో 90 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళల కోసం గొప్పలు చెప్పుకోవడానికి పథకాలు బడ్జెట్‌లో ఉన్నాయి తప్పితే వాటికి నిధులు విడుదల లేవు.

ఈ సంప్రదాయానికి స్వస్తి పలికి మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి దానికి అునుగణంగానే పథకాల కేటాయింపులు చేశామన్నరు. సరైన ప్రణాళికలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తాం. మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు, చేసిన అప్పులు, ఏ మాత్రం అడ్డం కావి అని అన్నారు  

మరిన్ని చూడండి

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *