PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

క్యాష్‌, F&Oలో మరో 4 కొత్త సూచీలు – అతి త్వరలో ప్రారంభం

[ad_1]

NSE New Indices: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), క్యాష్‌ & డెరివేటివ్స్ విభాగంలో నాలుగు కొత్త సూచీలను ప్రారంభించింది. వీటిలో క్యాష్‌, ఫ్యూచర్స్ & ఆప్షన్స్‌ (F&O) ట్రేడింగ్ సోమవారం (08 ఏప్రిల్ 2023‌) నుంచి ప్రారంభం అవుతుంది.

ఈ నాలుగు సూచీలు క్యాష్‌తో పాటు ఫ్యూచర్స్ & ఆప్షన్స్ కేటగిరీలు రెండింటిలోనూ ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయని NSE ప్రకటించింది. NSE సర్క్యులర్ ప్రకారం, నాలుగు కొత్త ఇండీస్‌ల పేర్లు – నిఫ్టీ టాటా గ్రూప్ 25% క్యాప్, నిఫ్టీ 500 మల్టీ క్యాప్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ 50:30:20, నిఫ్టీ 500 మల్టీ క్యాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 50:30:20, నిఫ్టీ మిడ్‌ స్మాల్ హెల్త్‌కేర్.

నిఫ్టీ టాటా గ్రూప్ 25% క్యాప్
ఈ ఇండెక్స్‌లో 10 కంపెనీలు ఉన్నాయి. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రాతిపదికగా ఈ కంపెనీలను ఎంపిక చేశారు. TCS, టాటా మోటార్స్‌, టైటన్‌ కంపెనీ వంటి ప్రముఖ కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. టాటా గ్రూప్‌లోని 10 అతి పెద్ద లిస్టెడ్ కంపెనీలు ఈ ఇండెక్స్‌లో చేర్చినట్లు చెప్పవచ్చు. ఈ ఇండెక్స్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 17.34 శాతం రాబడి ఇచ్చింది.

నిఫ్టీ 500 మల్టీ క్యాప్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ 50:30:20
75 కంపెనీల షేర్లు ఈ ఇండెక్స్‌లో ఉన్నాయి. వీటిలో లార్జ్ క్యాప్ కంపెనీలకు సగం (50%) వెయిటేజీ ఇవ్వగా, మిడ్‌ క్యాప్‌కు 30 శాతం, స్మాల్ క్యాప్‌కు 20 శాతం వెయిటేజీ లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, మారుతి సుజుకి ఇండియా, మహీంద్ర & మహీంద్ర, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హిందాల్కో ఇండస్ట్రీస్, JSW స్టీల్ మరియు సిప్లా వంటి వాటి ప్రధాన స్టాక్స్‌ ఈ ఇండెక్స్‌లో ఉన్నాయి.

నిఫ్టీ 500 మల్టీ క్యాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 50:30:20
మౌలిక సదుపాయాల రంగంలోని ప్రత్యేక షేర్లను మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఇందులో చేర్చారు. లార్సెన్ & టూబ్రో, RIL, భారతి ఎయిర్‌టెల్, NTPC, మాక్స్ హెల్త్‌కేర్, పవర్ గ్రిడ్ కార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియన్ హోటల్స్, ONGC, అదానీ పోర్ట్స్ వంటి షేర్లు ఈ ఇండెక్స్‌లో ఉన్నాయి.

నిఫ్టీ మిడ్‌ స్మాల్ హెల్త్‌కేర్
ఈ సూచిక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన హెల్త్‌కేర్ కంపెనీలపై దృష్టి పెడుతుంది. ఇందులో నిఫ్టీ మిడ్స్‌ స్మాల్‌ క్యాప్ 400 ఇండెక్స్‌లోని 30 షేర్లు ఉన్నాయి. 6-నెలల సగటు ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఆధారంగా కంపెనీలను యాడ్‌ చేస్తారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *