PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

క్రెడిట్ కార్డ్‌ వద్దనుకుంటే క్యాన్సిల్‌ చేయండి, లేకపోతే మీకే నష్టం, ఇదిగో ఈజీ ప్రాసెస్‌

[ad_1]

Guidance to Cancel or Close a Credit Card: ప్రస్తుతం, మన దేశంలో మొత్తం 31 బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. వీటిలో మొదటి ఆరు సంస్థలదే ఆధిపత్యం. వీటి మార్కెట్‌ వాటా 81% కాగా, మిగిలిన 25 సంస్థల మార్కెట్‌ వాటా 19%. క్రెడిట్‌ కార్డుల జారీలో HDFC బ్యాంక్‌ లీడింగ్‌ పొజిషన్‌లో ఉంది.

దేశంలో దాదాపు 9.5 కోట్ల క్రెడిట్‌ కార్డులు (Total Credit Cards in India)
ఇటీవలి లెక్క ప్రకారం, మన దేశ ప్రజల జేబుల్లో దాదాపు 94.71 మిలియన్లకు పైగా (9.47 కోట్లకు పైగా) క్రెడిట్‌ కార్డ్‌లు  ఉన్నాయి. వీటి ద్వారా చేసే ఖర్చులు (credit card spendings) ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి పండుగ సీజన్‌ కారణంగా, క్రెడిట్ కార్డ్ ఖర్చులు చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 2023 అక్టోబర్‌లో, క్రెడిట్‌ కార్డ్‌ల ద్వారా ప్రజలు రూ.1.78 లక్షల కోట్లు స్పెండ్‌ చేశారు. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ వ్యయం 25.35% పెరిగింది.

ప్రస్తుతం, ఇండియాలో చాలా మంది దగ్గర ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. ముఖ్యంగా, ఎక్కువ ఆదాయం ఆర్జించే వ్యక్తులు ఎక్కువ కార్డులను పర్స్‌లో పెట్టుకుని తిరుగుతున్నారు.

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఏటికేడు క్రెడిట్‌ కార్డ్‌ల జారీని పెంచుతూ పోతున్నాయి. రివార్డ్‌ పాయింట్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, నో ప్రాసెసింగ్‌ ఫీ వంటి కొత్త ఫీచర్లను క్రెడిట్‌ కార్డ్‌లకు జోడిస్తూ జనానికి గాలం వేస్తున్నాయి. ఈ ఆఫర్లకు ఆకర్షితులవుతున్న ప్రజలు కొత్త కార్డులను ఎగబడి తీసుకుంటున్నారు. అప్పటికే వారి వద్ద ఉన్న కార్డులను వాడకుండా వదిలేస్తున్నారు. 

క్రెడిట్‌ కార్డ్‌ రద్దు ఇలా.. (How To Close or Cancel a Credit Card?)

మీకు అవసరం లేని, వద్దనుకున్న క్రెడిట్‌ కార్డులను రద్దు చేసుకోకుండా అలాగే వదిలి పెడితే మీ క్రెడిట్‌ హిస్టరీ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. మీకు అక్కర్లేని క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయాలనుకుంటే, అందుకు సులభమైన పద్ధతులు ఉన్నాయి.

– అవసరం లేదు అనుకున్న క్రెడిట్ కార్డును రద్దు చేయడానికి.. సంబంధింత బ్యాంక్‌, NBFC కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి. అన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలకు హెల్ప్‌లైన్ నంబర్‌లు/ కస్టమర్ కేర్ నంబర్లు ఉన్నాయి. ఈ నంబర్లకు కాల్ చేసి, కార్డ్ రద్దు చేయమని రిక్వెస్ట్‌ చేయవచ్చు. మీరు చేయాల్సింది ఇంతే. రిక్వెస్ట్‌ చేసిన కొన్ని రోజుల్లోనే క్రెడిట్‌ కార్డ్‌ రద్దవుతుంది.

 – క్రెడిట్ కార్డ్‌ రద్దు కోసం రాతపూర్వకంగా కూడా రిక్వెస్ట్‌ పంపొచ్చు. ఉదాహరణకు, SBI క్రెడిట్ కార్డును క్యాన్సిల్‌ చేయాలని అనుకుంటే, ఆ బ్యాంక్ శాఖకు వెళ్లి సంబంధిత ఫారం సమర్పించవచ్చు. ఆ తర్వాత మీ క్రెడిట్ కార్డును బ్యాంక్‌ క్లోజ్‌ చేస్తుంది.

– క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడానికి బ్యాంక్‌కు ఈ-మెయిల్ కూడా చేయవచ్చు. కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు బ్యాంక్‌/NBFCకి అధికారిక ఈ-మెయిల్ ID ఉంటుంది. ఆ ఐడీకి ఈ-మెయిల్ చేసి, కార్డు రద్దు కోసం అభ్యర్థించవచ్చు.

– ఇంతకంటే సులభమైన మార్గం కూడా ఉంది. క్రెడిట్ కార్డ్‌ను మీరే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా రద్దు చేయొచ్చు. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌/యాప్‌లోకి లాగిన్‌ అయ్యి, క్రెడిట్‌ కార్డ్‌ క్యాన్సిలేషన్‌ కోసం రిక్వెస్ట్‌ పంపవచ్చు. బ్యాంకు తదుపరి చర్యలు తీసుకుంటుంది.

క్రెడిట్ కార్డ్‌ రద్దు చేయాలని అనుకుంటే, ఆ కార్డ్‌పై ఉన్న బకాయి మొత్తాన్ని ముందుగానే చెల్లించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. మీ కార్డ్‌లో ఒక్క పైసా బకాయి ఉన్నా మీ క్రెడిట్ కార్డు రద్దు కాదు.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *