PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

గొంతు నొప్పి వేధిస్తోందా..? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి వెంటనే రిలీఫ్‌ వస్తుంది

[ad_1]

Tips To Get Rid Of Sore Throat: శీతాకాలం.. చాలామంది ఫేవరెట్‌ సీజన్‌ ఇది. చల్లని వాతావరణం, పొగమంచు మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి. చలికాలం.. అందమైన వాతావరణంతో పాటు.. ఎన్నో వ్యాధులను వెంట తీసుకొస్తూ ఉంటుంది. ఈ కాలంలో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్‌ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సీజన్‌ మారినప్పుడూ జలుబుతో పాటు గొంతునొప్పి ఇబ్బంది పెడుతుంటుంది. వాతావరణంలోని మార్పులతో హానికారక బ్యాక్టీరియా, వైరస్‌లు గొంతులో తిష్ఠ వేస్తాయి. ఎదైనా తాగాలన్నా, తినాలనిపించినా గొంతులో ముల్లు దిగినట్లు ఉంటుంది. కొంతమందికి.. మాటకూడా రానివ్వదు. కొంతమంది గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ట్యాబ్లెట్స్‌ వేసుకుంటూ ఉంటారు. ప్రతిసారీ మందులు మింగేయకుండా… ఇంట్లో ఉన్న పదార్థాలతోనూ గొంతునొప్పిని తరిమేయవచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

తేనె..

రీసెర్చ్ గేట్‌లో ప్రచురించి ఒక నివేదిక ప్రకారం, గొంతు ఇన్ఫెక్షన్‌కు తేనె ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దగ్గు, జలుబును తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో పాటు గొంతు నొప్పిని తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. అల్లం పేస్ట్‌లో తేనె వేసి తీసుకుంటే గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

అల్లం..

NCBI నివేదిక ప్రకారం, అల్లంలో జింజెరోన్, జింజెరాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, వైరస్‌లతోనూ పోరాడతాయి. గొంతు నొప్పిని తగ్గించుకోవడానికి అల్లం బెస్ట్‌ ఆప్షన్‌. అల్లంతో తయారు చేసిన టీ తాగడం వల్ల గొంతునొప్పి నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. లేదంటే అర చెక్క అల్లాన్ని టీ లేదా తేనెలో కలుపుకుని తీసుకున్నా రిజల్ట్స్‌ ఉంటాయి.

పసుపు..

పసుపులో కర్కుమిన్ అనే పాలీఫెనాల్ ఉంటుంది. దీనికి యాంటీవైరస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలను నివారించడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడతాయి. పసుపు గొంతు నొప్పిని తగ్గించడానికి ఔషధంలా పని చేస్తుంది. గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసి రోజుకు 2 – 3 సార్లు తాగితే.. మీకు ఉపశమనం లభిస్తుంది.

మిరియాలు..

నల్ల మిరియాలలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది జలుబు, దగ్గు లక్షణాలను నియంత్రించడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, ఎక్స్‌పెక్టరెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది శ్వాసకోశంలో పేరుకున్న శ్లేష్మం, కఫాన్ని తొలగిస్తుంది. గోరువెచ్చని నీళ్లలో రెండు చిటికెల నల్ల మిరియాల పొడి వేసి తాగితే మంచిది. గోరువెచ్చని పాలలో మిరియాలు, బెల్లం పొడి వేసి తాగినా.. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్కలో యాంటీవైరస్, యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. గొంతు నొప్పిని తగ్గించడానికీ ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు దాల్చిన చెక్క, అల్లం పొడి, కొద్దిగా తేనె వేసి కలపండి. ఈ పాలను రోజుకు రెండు సార్లు తాగితే.. గొంతు గరగర త్వరగా నయం అవుతుంది.

ఇంగువ..

ఇంగువలో యాంటీవైరల్ మెండుగా ఉన్నాయి. ఇది దగ్గుకు ఔషధంలా పనిచేస్తుంది. ఇంగువ వాసనకు బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను ఇంగువ దూరం చేస్తుంది. ఈ సీజన్‌లో వచ్చే ఫ్లూను ఎదుర్కోవడానికి ఇంగువ నీరు బాగా పనికొస్తుంది. ఇంగువ తీసుకుంటే.. ఛాతీ రద్దీని తగ్గుతుంది, కఫం కరుగుతుంది. చిటికెడు ఇంగువ వేసిన నీరు తాగితే.. గొంతు నొప్పి తగ్గుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఇంగువ పొడి, కొద్ది మొత్తంలో అల్లం పొడి కలిపి తాగినా రిజల్ట్స్‌ ఉంటాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *