[ad_1]
ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం:
గతేడాది చివరి నాటికి చైనా జనాభా దాదాపు 8.5 లక్షలు తగ్గి 1.41175 బిలియన్లకు చేరుకున్నట్లు చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ఈ క్షీణత దీర్ఘకాలం కొనసాగుతుందని.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2021లో ప్రతి 1,000 మందికి జనాభాకు 7.52గా ఉన్న జననాల రేటు.. 2022లో 6.77కు పడిపోయింది. తద్వారా అత్యంత తక్కువ జనన రేటుతో గతేడాది కొత్త రికార్డు నెలకొంది.
మరణాల్లోనూ అత్యధికం:
1974 నుంచి చూస్తే మరణాల్లోనూ అత్యధిక రేటు గతేడాదే నమోదైనట్లు చైనా వెల్లడించింది. 2021లో 1,000 మందికి 7.18 మరణాల రేటుతో పోలిస్తే 2022కి 7.37 కి పెరిగింది. 2050 నాటికి ఆ దేశ జనాభా 109 మిలియన్లకు తగ్గిపోతుందని ఐక్యరాజ్యసమితి నిపుణులు చెబుతున్నారు. 2019లో వారి అంచనాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
కలలు కల్లలేనా ?
ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే చైనా కలకు ఈ నివేదిక గండి కొడుతున్నట్లు కనిపిస్తోంది. పౌరుల్లో అధికులు సీనియర్ సిటిజన్లు కాగా.. ఆదాయాలు తగ్గి ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. వారి సంరక్షణకు సైతం ప్రభుత్వ అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తద్వారా రుణాలూ పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 1980-2015 కాలంలో చైనా విధించిన ‘వన్ చైల్డ్’ పాలసీ ఫలితంగా జనాభా పెరుగుదల తీవ్రంగా మందగించినట్లు తెలుస్తోంది.
పిల్లల ఉన్నత విద్యకు భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో.. అసలు పిల్లలే వద్దని లేదా ఒక్కరు చాలు అని చైనీయులు భావించినట్లు అర్థమవుతోంది. మూడేళ్లుగా అక్కడ అమలవుతున్న జీరో కొవిడ్ విధానమూ మరో కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
దిద్దుబాటు చర్యలు:
పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన చైనా.. జననాలు రేటును పెంచేందుకు చర్యలు చేపట్టింది. స్థానిక ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపులు ఇవ్వడం, సుదీర్ఘ ప్రసూతి సెలవులు, గృహ రాయితీల ద్వారా.. ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రజలను ప్రోత్సహించడానికి 2021 నుండి ప్రత్నిస్తోంది. ఈ చర్యలు కొంతమేర సత్ఫలితాలను ఇస్తాయని భావిస్తున్నారు.
భారత్ ఇందుకు భిన్నంగా..
బేబీ స్త్రోలర్‌ల కోసం ఆన్‌లైన్‌లో శోధించడం 2022లో 17% పడిపోగా.. 2018 నుంచి చూస్తే 41% తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా వృద్ధుల సంరక్షణ గృహాల కోసం శోధనలు ఎనిమిది రెట్లు పెరిగాయి. భారత్‌లో ఈ రేటు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఏటేటా గూగుల్‌లో బేబీ బాటిళ్ల కోసం వెతికే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒక్క 2022లో నే 15% పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
[ad_2]
Source link