Feature
oi-Garikapati Rajesh
గ్రహాలకు
రాజు
అయిన
సూర్యుడు
జూన్
15వ
తేదీ
సాయంత్రం
6.07
గంటలకు
మిథునరాశిలోకి
ప్రవేశిస్తాడు.
జులై
16వ
తేదీ
ఉదయం
4.59
వరకు
ఉంటాడు.
అనంతరం
కర్కాటకరాశిలోకి
ప్రవేశిస్తాడు.
బుధుడు
మిథునరాశికి
అధిపతి.
ఇటువంటి
పరిస్థితుల్లో
ఈ
రాశిలోకి
సూర్యుడి
ప్రవేశం
వల్ల
అనేక
మార్పులు
చోటుచేసుకుంటాయి.
బుధుడి
మూలకం
గాలి,
సూర్యుడి
మూలకం
అగ్ని.
దీనివల్ల
కొన్ని
రాశులవారు
కష్టాలను
ఎదుర్కోబోతున్నారు.
ఏయే
రాశులవారు
జాగ్రత్తగా
ఉండాలో
తెలుసుకుందాం.
వృషభ
రాశి
:
ఈ
రాశివారు
మాటల్లో
కొంత
నియంత్రణ
కలిగివుండాలి.
పరుష
పదజాలం
వాడటంవల్ల
ఎదుటివారు
కలతపడతారు.
కుటుంబంలో
ప్రతికూల
వాతావరణం
నెలకొంటుంది.
ఆరోగ్యంపై
తప్పనిసరిగా
శ్రద్ధ
వహించాలి.

తులా
రాశి
:
ఈ
రాశివారు
ఆరోగ్యంపట్ల
జాగ్రత్తగా
ఉండాలి.
సమాజంలో
గౌరవం
పొందుతారుకానీ
కొన్ని
కారణాలవల్ల
ఇక్కట్లను
ఎదుర్కోవాల్సి
ఉంటుంది.
డ్రైవింగ్
చేసేటప్పుడు
అప్రమత్తంగా
ఉండాలి.
ఉద్యోగస్తులు
బదిలీ
అవడానికి
ఎక్కువ
అవకాశం
ఉంది.
అలాగే
కొత్త
పనుల్లో
కూడా
తీవ్ర
జాప్యం
నెలకొంటుంది.
తండ్రితో
ఉన్న
అనుబంధాన్ని
పాడుచేస్తుంది.
వృశ్చిక
రాశి
:
ఈ
రాశివారికి
సూర్యుడు
8వ
ఇంట్లో
సంచరిస్తున్నాడు.
అంత
అనుకూలం
కాదు.
అన్ని
విషయాల్లో
జాగ్రత్త
అవసరం.
మీకు
వ్యతిరేకంగా
ఎవరైనా
కుట్రలకు
పాల్పడే
అవకాశం
ఉంది.
ఆర్థిక
పరిస్థితి
కూడా
బలహీనంగా
మారుతుంది.
కుటుంబ
వాతావరణం
విచ్ఛిన్నమయ్యే
అవకాశాలు
కనిపిస్తుండటంతో
ఇంట్లో
శాంతి
నెలకొనడానికి,
సంతోషాన్ని
కొనసాగించడానికి
ఎక్కువ
దృష్టిసారించాల్సి
ఉంటుంది.
మీన
రాశి
:
సూర్యుడి
సంచారం
ఈ
రాశివారికి
4వ
ఇంట్లో
ఉంటుంది.
దీనివల్ల
శారీరక,
మానసిక
సమస్యలతోపాటు
ఆర్థిక
సమస్యలను
కూడా
ఎదుర్కోవాల్సి
ఉంటుంది.
కుటుంబంలో
చీలిక
ఉంటుంది.
తల్లిదండ్రుల
ఆరోగ్యంపై
ఆందోళన
కలుగుతుంది.
ఏదైనా
ఆస్తి
కొనుగోలు
చేయాల్సి
వస్తే
పూర్తిస్థాయిలో
విచారించుకున్న
తర్వాత
మాత్రమే
కొనుగోలు
చేయాలి.
మానసిక
ఒత్తిడిని
ఎదుర్కొంటారు.
English summary
Sun, the ruler of the planets, will enter Gemini on June 15th at 6.07 pm.
Story first published: Saturday, May 27, 2023, 12:31 [IST]