PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

టాక్స్‌ స్లాబ్స్‌లో మార్పులు ఉంటాయా, ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు?

[ad_1]

Budget 2024 Expectations: బడ్జెట్ 2024 లాంచింగ్‌ డేట్‌ దగ్గర పడేకొద్దీ.. కేంద్ర పద్దు గురించి, అది తీసుకురాబోయే మార్పుల గురించి టాక్స్‌పేయర్స్‌ (Taxpayers) మధ్య వేడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఆఫీసుల్లో, పరిశ్రమల్లో, టీ కొట్ల దగ్గర బడ్జెట్‌ గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా, ఆదాయ పన్నుకు సంబంధించి, ఆర్థిక మంత్రి నిర్మలమ్మ (Finance Minister Nirmala Sitharaman) నుంచి టాక్స్‌పేయర్లు చాలా వరాలు ఆశిస్తున్నారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌‌ (Interim Budget 2024) ప్రకటిస్తారు. మన దేశంలో అతి త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, ఈ ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టడం లేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం సమగ్ర బడ్జెట్‌ను రూపొందిస్తుంది. 

సాధారణంగా, మధ్యంతర బడ్జెట్‌ సాదాసీదాగా ఉంటుంది, విధానపరంగా పెద్దగా మార్పులు ఉండవు. 

2023 బడ్జెట్‌ను సమర్పించే సమయంలో‍‌, ఆదాయపు పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలు (Income Tax Rules) తీసుకొచ్చింది. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని (New Income Tax Regime) డిఫాల్ట్ పన్ను విధానంగా మార్చింది. కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ స్లాబ్స్‌ను కుదించి, 5కు చేర్చింది. పాత పన్ను విధానంలో (Old Income Tax Regime).. పన్ను తగ్గింపులు, మినహాయింపులకు లోబడి టాక్స్‌ శ్లాబ్‌ వర్తిస్తుంది.

కొత్త పన్ను విధానంలో అమల్లో ఉన్న ఇన్‌కమ్‌ టాక్స్‌ స్లాబ్స్‌‌ (New Income Tax Regime Slabs):

1‌) రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు మొదటి శ్లాబ్‌, దీనిపై 5 శాతం పన్ను చెల్లించాలి.
2‌) రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు రెండో శ్లాబ్‌, దీనిపై 10 శాతం టాక్స్‌ పడుతుంది.
3) రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు మూడో శ్లాబ్‌, దీనిపై 15 శాతం పన్ను బాధ్యత ఉంటుంది. 
4‌) రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు నాలుగో శ్లాబ్‌, దీనిపై  20 శాతం టాక్స్‌ కట్టాలి. 
5‌) రూ. 15 లక్షల పైన ఎంతున్నా ఐదో శ్లాబ్‌ పరిధిలోకి వస్తుంది, ఆ ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాలి.

ఏ బడ్జెట్‌లోకైనా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అంశం ఆదాయపు పన్ను శ్లాబ్‌ల సవరణ. ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం (Inflation) పెరిగింది, జీవన వ్యయాలు మారాయి. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతమున్న స్లాబ్స్‌ పరిధి పెంచుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచితే, తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులపై పన్ను భారం ‍‌(Tax load) తగ్గుతుంది. 2024 బడ్జెట్‌లో కొత్త టాక్స్‌ స్లాబ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించొచ్చని టాక్స్‌పేయర్లు ఆశిస్తున్నారు.

పన్ను రాయితీ (Tax Rebate): కొత్త పన్ను విధానంలో, కేంద్ర ప్రభుత్వం, పన్ను రాయితీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచింది. ఇప్పుడు, రూ. 7 లక్షల లోపు వార్షిక ఆదాయం (annual income) ఉన్న వ్యక్తులు టాక్స్‌ కట్టాల్సిన పని లేదు. ప్రస్తుతం దేశంలోఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, టాక్స్‌ రిబేట్‌ను మరింత పెంచాలని, పాత పన్ను విధానానికి కూడా దానిని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్లాయి.

స్టాండర్డ్ డిడక్షన్ ‍‌(Standard Deduction): పాత పన్ను విధానంలో వర్తించే రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను, 2023 బడ్జెట్‌లో, కొత్త పన్ను విధానానికి కూడా ఆపాదించారు ఆర్థిక మంత్రి. ఇప్పుడు, కొత్త & పాత పన్ను విధానాల్లో టాక్స్‌ రిబేట్‌కు అదనంగా రూ. 50,000 ప్రామాణిక తగ్గింపు కూడా కలుస్తుంది. చాలా సంవత్సరాలుగా మారకుండా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను ఈసారైనా రూ.లక్షకు పెంచుతారని ఉద్యోగ వర్గాలు ఆశపడుతున్నాయి.

మరో ఆసక్తికర కథనం: విదేశాల్లోనే బంగారం చౌక – ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *