PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

తీసుకున్న లోన్‌ కట్టలేదని ఫోన్ చేస్తుంటే మీరు కేసు పెట్టొచ్చు!

[ad_1]

<p>కేసులైనా, అరెస్టులైనా డోంట్&zwnj; కేర్&zwnj; అంటున్నాయ్&zwnj; లోన్&zwnj; యాప్స్&zwnj;. చస్తే చావండి మాకేంటి? శవాల నుంచి కూడా సొమ్ము వసూల్&zwnj; చేస్తాం. చచ్చినా సరే డబ్బు మాత్రం కట్టాల్సిందేనంటూ బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నాయ్&zwnj; లోన్&zwnj; యాప్స్&zwnj;. ఈ ఆన్&zwnj;లైన్&zwnj;లో ఊరించే ఈజీలోన్&zwnj; ..చివరకు ఉరితాడవుతోంది. యాప్&zwnj;లోన్&zwnj; అప్పు నిండుప్రాణాలను బలితీసుకుంటోంది. తీసుకున్న లోన్లు యమపాశంలా మారీ ప్రాణాల్ని బలి తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట లోన్&zwnj; రికవరీ ఏజెంట్ల ఆగడాలను తట్టుకోలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే వందల కోట్ల రూపాలయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని, దేశం విడిచిపోయిన వారిని వదిలేసి.. రూ. 1000, రూ. 2000 రూపాయల లోన్&zwnj; తీసుకున్నోడినే తీవ్రంగా హింస్తున్నారు.</p>
<p>కొన్నిసార్లు పరిస్థితులు బాలేక లోన్&zwnj; కట్టడం కాస్త ఆలస్యం అవుతుందోనేమో కానీ.. కచ్చితంగా కట్టే వాళ్లు కూడా ఉంటారు. కానీ ఇదేం పట్టించుకోకుండా వాళ్లకు సమయం ఏమి ఇవ్వకుండా తీవ్రంగా హింసిస్తుంటారు బ్యాంక్&zwnj; ఏజెంట్లు. రాబందుల్లా ఇబ్బందులు పెడుతూ.. అసభ్యకరమైన మెసేజ్&zwnj;లు పెడుతూ ఇంట్లో వాళ్లను సైతం ఇబ్బందులకు గురి చేసేవారిపై యాక్షన్&zwnj; తీసుకునే హక్కు మీకు ఉందని మీకు తెలుసా.? అంతేకాదు.. లోన్&zwnj; తీసుకున్న వ్యక్తికి.. లోన్&zwnj; రికవరీ ఏజెంట్&zwnj; ఎప్పుడు పడితే కాల్స్&zwnj; చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, అలాగే ఇంట్లోవాళ్లకు ఫోన్&zwnj; చేసి బెదిరించడం వంటివి చేసే హక్కు లేదు. అలా చేసినందుకు సంబంధిత బ్యాంక్&zwnj; లేదా లోన్&zwnj; యాప్&zwnj;పై లేదా సంబంధిత లోన్&zwnj; ఏజెంట్&zwnj;లపై లోన్&zwnj; తీసుకున్న వ్యక్తి కేసు పెట్టొచ్చు.&nbsp;</p>
<p>బ్యాంక్&zwnj;కు లోన్&zwnj; రికవరీ ఏజెంట్లు కేవలం ఉదయం 8గంటల నుంచి రాత్రి 7గంటల మధ్య మాత్రమే కాల్&zwnj; చేయాలి. ఒకవేళ రాత్రి 7 తర్వాత కాల్&zwnj; చేసిన, లేదా బ్యాంక్&zwnj; ఆటోమెటిక్&zwnj; కాల్&zwnj; సెంటర్&zwnj; నుంచి కాల్&zwnj; వస్తే.. మీరు మొదట సంబంధిత బ్యాంక్&zwnj; అఫీషియల్&zwnj; వెబ్&zwnj;సైట్&zwnj;కు లాగిన్&zwnj; అయి, కంప్లైంట్&zwnj; ఇవ్వొచ్చు. మీ లోకల్&zwnj; పోలీస్&zwnj; స్టేషన్&zwnj;కు కాల్&zwnj; చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ రెండు కానీ పక్షంలో మీరు నేరుగా.. ఆర్బీఐ ఆఫీషియల్&zwnj; వెబ్&zwnj;సైట్&zwnj; ఓపెన్&zwnj; చేసి, అందులో ఉంటే కంప్లైయింట్ నెంబర్&zwnj;కు కాల్&zwnj; చేసి మరీ చెప్పవచ్చు.</p>
<p>ఇప్పటికే అక్రమ రుణ యాప్&zwnj;ల ఆగడాలను అరికట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్&zwnj; నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. యాప్&zwnj; స్టోర్లలో కేవలం చట్టబద్ధమైన యాప్స్&zwnj; మాత్రమే ఉంచి అక్రమ యాప్&zwnj;లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇటీవల రుణ యాప్&zwnj;ల ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అంతేకాదు.. చట్టబద్ధంగా రుణాలు ఇచ్చే యాప్&zwnj;ల జాబితాను ఆర్&zwnj;బీఐ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఒక నిర్ణీత గడువు నిర్ణయించి పేమెంట్&zwnj; అగ్రిగేటర్లంతా ఆర్&zwnj;బీఐ వద్ద రిజిస్టర్&zwnj; అవ్వాల్సి ఉంటుంది. గడువులోగా నమోదైన పేమెంట్&zwnj; అగ్రిగేటర్లను మాత్రమే కార్యకలాపాలు సాగించేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.&nbsp;</p>

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *