PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

త్వరలో ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు దించనున్న మహీంద్రా – లైనప్ మామూలుగా లేదుగా!

[ad_1]

Mahindra Electric SUV: గత నెలలో మహీంద్రా & మహీంద్రా దాని స్కార్పియో, బొలెరో, థార్‌తో సహా ఇప్పటికే ఉన్న అనేక కార్ల ఎలక్ట్రిక్ వెర్షన్‌లను తీసుకురావాలని ప్రణాళికలను వెల్లడించింది. దీనితో పాటు, ఎక్స్‌యూవీ.e (ఎక్స్‌యూవీ.e8, ఎక్స్‌యూవీ.e9), BE (BE.05, BE.07, BE.09) అనే రెండు వేర్వేరు బ్రాండ్‌ల క్రింద కంపెనీ అనేక కొత్త ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు వాటి కాన్సెప్ట్ రూపంలో కనిపించాయి. మహీంద్రా తన ఎక్స్‌యూవీ.e8 ను ముందుగా మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎలక్ట్రిక్ మోడల్‌గా ఉంటుంది. దీన్ని 2024 డిసెంబర్ నాటికి మార్కెట్లోకి తీసుకురావచ్చు. ఎక్స్‌యూవీ.e8 టాటా సఫారీ ఈవీతో పోటీపడుతుంది. ఇది టెస్టింగ్‌లో. వచ్చే ఏడాది లాంచ్ కానుంది.

ఇంగ్లో ప్లాట్‌ఫారమ్‌లో నిర్మాణం
మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ, బీఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని బ్రాండ్ ఎంఏడీఏ (మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్) డిజైన్ స్టూడియోలో తయారు కానున్నాయి. అన్ని మోడల్స్ ప్రత్యేకమైన డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంటాయి. బోర్న్ ఎలక్ట్రిక్ INGLO ప్లాట్‌ఫారమ్‌పై వీటిని రూపొందించనున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ మోటార్‌తో
థార్, స్కార్పియో, బొలెరో ఎలక్ట్రిక్ వెర్షన్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని మహీంద్రా వెరిఫై చేసింది. మూడు ఎస్‌యూవీల ఎలక్ట్రిక్ వెర్షన్‌ల పేర్ల చివర్లో ‘.ఈ’ అని కనిపిస్తుంది. రాబోయే మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కంపెనీ కొత్త లోగోను కలిగి ఉంటుంది. కంపెనీ ఇంగ్లో ఆర్కిటెక్చర్ పీ1 వెర్షన్‌లో థార్.ఈ, స్కార్పియో.ఈ, బొలెరో.ఈలను నిర్మిస్తుంది. దీని కారణంగా వాటి ఆఫ్ రోడ్ సామర్థ్యాలలో ఎలాంటి తగ్గింపు ఉండదు. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఫోక్స్‌వ్యాగన్ నుంచి ఎలక్ట్రిక్ మోటార్లతో వెనుక చక్రాల డ్రైవ్ (RWD) వ్యవస్థలను కలిగి ఉంటాయి. అయితే ఎలక్ట్రిక్ స్కార్పియోను ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సెటప్‌తో కూడా అందించవచ్చు.

ఎలక్ట్రిక్ థార్ ఎలా ఉండనుంది?
మహీంద్రా థార్.ఈ కాన్సెప్ట్ వెర్షన్‌ను గత నెలలో దక్షిణాఫ్రికాలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రదర్శించారు. ఈ కారు దాని ICE (ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్) మోడల్‌కు పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ముందు భాగంలో ఇది దీర్ఘచతురస్రాకార గ్రిల్, కాంపాక్ట్ విండ్‌షీల్డ్, స్పష్టమైన బంపర్, రెండు చదరపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో కూడిన చతురస్రాకార, రెట్రో స్టైల్ డిజైన్‌ను కలిగి ఉంది. కొన్ని ఇతర డిజైన్ హైలైట్‌లలో ఆఫ్ రోడ్ టైర్లు, ఫ్లాట్ రూఫ్, బ్లాక్ అవుట్ రియర్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, టెయిల్‌గేట్‌పై స్పేర్ వీల్ ఉన్నాయి. 3 డోర్, 5 డోర్ థార్.ఈ ఎస్‌యూవీలు రెండూ ఒకే రియర్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్, బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లాంచ్ కానున్నాయి. అంతేకాకుండా ఇది AWD సిస్టమ్‌తో డ్యూయల్ మోటార్ సెటప్‌ను కూడా పొందవచ్చు.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *