[ad_1]
Personal loan disadvantages: ఈమధ్య కాలంలో, బ్యాంక్‌లు ఇస్తున్న వ్యక్తిగత రుణాల సంఖ్య, మొత్తం బాగా పెరిగింది. పర్సనల్ లోన్ పొందడం నిమిషాల్లో పని. ఎలాంటి తనఖా లేకుండా బ్యాంక్‌లు ఇచ్చే లోన్ ఇది. వ్యక్తిగత రుణాలతో బ్యాంక్‌లకు రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇలాంటి అన్-సెక్యూర్డ్ లోన్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ (RBI) కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది.
అసలు విషయంలోకి వస్తే.. పెట్టుబడి కోసం, వ్యక్తిగత అవసరాల కోసం, ఇతర అప్పులు తీర్చడానికి, ఇతర లోన్‌తో కలపడానికి పర్సనల్ లోన్‌ను తీసుకుంటుంటారు. లోన్ తీసుకోవడం తప్పు కాదు. కానీ, దానిని ఎందుకోసం ఉపయోగిస్తున్నాం అన్నదే ముఖ్యం.
మీకు రెగ్యులర్‌గా మంచి ఆదాయం వస్తూ, అప్పు తీర్చగల సామర్థ్యం ఉందని బ్యాంకులు భావిస్తే… పర్సనల్ లోన్ ఇస్తామంటూ వెంటబడతాయి. పర్సనల్ లోన్‌లో తక్కువ డాక్యుమెంటేషన్ ఉంది. రుణానికి చాలా త్వరగా ఆమోదం లభిస్తుంది.
అసురక్షిత రుణం (Unsecured loan) కావడంతో, వ్యక్తిగత రుణంపై బ్యాంక్‌లు వసూలు చేసే వడ్డీ రేటు… గృహ రుణం (home loan), కార్ లోన్ (Car loan), బంగారంపై రుణం (Loan against gold), సెక్యూరిటీలపై రుణం (Loan against securities) వంటి సురక్షిత రుణాల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. పర్సనల్ లోన్‌పై వడ్డీతో పాటు, ప్రాసెసింగ్ ఫీజు, EMI బౌన్స్ ఛార్జ్, ప్రీ-పేమెంట్ లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జ్, లోన్ ప్రాసెసింగ్ ఫీజ్, ప్రీ-పేమెంట్‌పై GST వంటి ఛార్జీలు కూడా ఉంటాయి.
అత్యవసర పరిస్థితుల్లో, ఇతర మార్గాలన్నీ మూసుకుపోయిన సమయంలో వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. అయితే, అది మీ లాస్ట్ ఆప్షన్‌గా ఉండాలి. వ్యక్తిగత రుణం తీసుకోకూడని పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి.
పర్సనల్ లోన్ తీసుకోకూడదని సందర్భాలు:
మీరు ఎక్కడైనా పెట్టుబడి పెడితే, దాన్నుంచి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని మీరు నమ్ముతున్నారని అనుకుందాం. అయితే, మీకు డబ్బు సమస్య ఉంది. పెట్టుబడి కోసం, బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం తీసుకుంటారు. అయితే, అప్పటి వరకు ఉన్న పరిస్థితులు తారుమారు కావచ్చు. పెట్టుబడి మీద భారీ ఆదాయం వస్తుందన్న మీ ఆలోచన తప్పై, సరైన రాబడి పొందలేక పోవచ్చు. లేదా, పెట్టుబడిని నష్టపోవచ్చు. మీకు లాస్ వచ్చిందని బ్యాంక్ వాళ్లు సరిపెట్టుకోరుగా. వాళ్లు ఇచ్చిన లోన్‌ను వడ్డీతో కలిపి తిరిగి కట్టాల్సిందే. ఇలాంటి అటువంటి పరిస్థితిలో మీరు అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది.
చాలా మంది అప్పు తీసుకుంటారు గానీ, దానిని తిరిగి ఎలా చెల్లించాలో ఆలోచించరు. పెద్ద మొత్తంలో రుణం తీసుకుంటే, తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. దీని కోసం సులభ వాయిదాల మార్గం (EMIs) ఎంచుకుంటారు, సంవత్సరాల తరబడి ఆ లోన్ కడుతూనే ఉంటారు.
మరికొందరు, ముఖ్యంగా యువత… ఖరీదైన మొబైల్ ఫోన్లు, షాపింగ్, ప్రయాణాల కోసం పర్సనల్ లోన్ రుణాలు తీసుకుంటారు. ఇవి వాళ్ల హాబీలే అయినా, అనవసర ఖర్చులు. కూడబెట్టిన డబ్బుతో హాబీలను కొనసాగించాలి తప్ప, అలాంటి వాటి కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం మూర్ఖత్వం.
కొందరు వ్యక్తులు చాలా అర్జంటుగా తాము కోటీశ్వరుడిలా మారిపోవాలని కోరుకుంటుంటారు. ఇందుకోసం, పర్సనల్ లోన్ తీసుకుని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం, అనుమానాస్పద స్కీమ్‌లో చేరడం వంటివి చేస్తుంటారు. ఈ తరహా పెట్టుబడుల్లో హై రిస్క్ ఉంటుంది. ఇలాంటి పనులు చేసిన 90% పైగా వ్యక్తులు డబ్బులు మొత్తం పోగొట్టుకుని అప్పుల్లో కూరుకుపోతున్నారు.
మీ భావోద్వేగాల వల్ల కూడా మీరు ఇబ్బందుల్లో పడతారు. ఇతరులకు సహాయం చేయడానికి మీ పేరిట వ్యక్తిగత రుణం తీసుకోవద్దు. ఇది చాలా పెద్ద తప్పు. మీరు ఎవరి కోసం లోన్ తీసుకున్నారో, ఆ వ్యక్తి డబ్బు తిరిగి చెల్లించకపోతే, ఆ భారం మొత్తం మీపైనే పడుతుంది. మీ బడ్జెట్ గతి తప్పుతుంది, ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయి. మీరు కూడా లోన్ తిరిగి చెల్లించలేకపోతే మీ క్రెడిట్ స్కోర్ మీద దెబ్బ పడుతుంది. కాబట్టి, మీ కోసం మాత్రమే పర్సనల్ లోన్ తీసుకోండి, ఇతరుల కోసం కాదు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
మరో ఆసక్తికర కథనం: అమ్మకానికి వచ్చిన అందమైన దీవి, మీ సొంతం చేసుకోవాలంటే ఎంత ఖర్చు చేయాలో తెలుసా?
[ad_2]
Source link