PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

పోడు పట్టాల పంపిణీకి కేసీఆర్ రెడీ, అమరావతిలో సెంటు భూములిస్తున్న జగన్

[ad_1]

Top 10 Headlines Today: 

ఉద్యోగులకు శుభవార్త

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వుం శుభవార్త తెలిపింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తు్న్న జిల్లాతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించగా..అంతర్ జిల్లాల బదిలీల్లో స్పాస్, మ్యూచువల్ బదిలీలకు వీలు కల్పించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

పోడు సమస్యకు చెక్

తెలంగాణలో జరిగే దశాబ్ధి అవతరణ వేడుకలపై సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్‌లతో సమీక్ష నిర్వహించారు. వేడుకల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత వ్యవసాయానికి జీవం పోయడమే ప్రథమ కర్తవ్యంగా పని చేశామన్నారు కేసీఆర్. అందుకోసం ముందు చెరవులు, విద్యుత్, సాగునీరు రంగాలని వృద్ధి పరిచామని తెలిపారు. ఆ కృషికి నేడు వస్తున్న పలితాలే న నిదర్శనమన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

పేదలకు అమరావతిలో జాగా

అమరావతి రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున ఇళ్ళ పట్టాల పంపిణికి జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటి  ప్రాంతంలో రూ. 443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా ఇదే సమయంలో ఆయా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించనుంది.   గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శుక్రవారం నాడు  లాంఛనంగా ముఖ్యమంత్రి   వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.. ప్రారంభించనున్నారు.   రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్దలాల కేటాయింపు వ్యవహరం తీవ్ర స్దాయిలో రాజకీయ వివాదానికి కారణం అయ్యింది. దీని పై అధికార ,ప్రతి పక్షాల మద్య మాటల యుద్దం నడిచింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

౩౦౦ సీట్లకుపైగా గెలుస్తాం

 నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ౩౦౦ సీట్లకుపైగా గెలుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నన్ని సీట్లు కూడా రావని షా అన్నారు. గౌహతిలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ కు అమిత్ షా శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బహిష్కరించి రాజకీయాలు చేస్తోంది మండిపడ్డారు. కాంగ్రెస్ వి చౌకబారు రాజకీయాలని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఎండ నుంచి కాస్త ఊరట 

వేసవి తాపంతో అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. దేశంలో హీట్​ వేవ్​ ముగిసిందని, ఇక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ వెల్లడించింది. అతి కొద్ది ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

విగ్రహం ఏర్పాటుకు నో

ఈ నెల 28న ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలిపేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, పిటిషన్‌దారులకు ఆదేశించింది. అనంతరం విచారణ జూన్ 6కి వాయిదా వేసింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

మొబైల్‌లో ఫుడ్ చూస్తే ఆకలి తీరిపోతుందట

జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అహనా పెళ్లంట’ మూవీలో కోట శ్రీనివాస రావు కోడిని ఎదురుగా వేలాడ దీసుకుని.. దాన్ని చూస్తూ ఉత్తి అన్నం తింటూ చికెన్ తిన్నంత తృప్తిగా ఉందని ఫీలవుతారు. ఆ సీన్ తలచుకుంటే ఇప్పటికీ నవ్వు ఆగదు. అయితే, తాజా స్టడీలో అది నిజమేనని తేలింది. మీకు ఆకలిగా ఉన్నపుడు ఫోన్లో ఆహార పదార్థాల బొమ్మలు చూస్తే చాలు.. మీ ఆకలి తీరిన భావన కలుగుతుందట. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

వైరల్‌గా మారిన ఫొటో 

అనేక బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో ప్రతినాయక పాత్రలు పోషించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయస్సులో రెండో వివాహం చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బరువాతో ఆశిష్ విద్యార్థి ఏడు అడుగులు వేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తిరుగులేని ముంబైై

ముంబై ఇండియన్స్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. అయితే అత్యంత విజయవంతమైన IPL జట్టు ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్‌లలో గెలిచి ఫైనల్‌కు చేరుకోగలదా? ముంబై ఇండియన్స్ గణాంకాలు ఏం చెబుతున్నాయి? మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

అగ్నివీరుల నియామక ర్యాలీల తేదీలు ఖరారు

అగ్నిపథ్‌ పథకంలో భాగంగా నిర్వహించిన అగ్నివీరుల నియామక ర్యాలీల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్ష ఫలితాలను మే 21న ప్రకటించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ (ఏఆర్‌వో).. తాజాగా నియామక ర్యాలీల తేదీలను విడుదల చేసింది. ఈ ర్యాలీలో భాగంగా రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శారీరక సామర్థ్య, వైద్య తదితర పరీక్షలు నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *