Hyundai Elantra N launch: ఫ్రముఖ కార్ల బ్రాండ్ హ్యుందాయ్ తన ‘ఎన్’ బ్రాండ్ ఎనిమిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్లోబల్ మార్కెట్‌లో కొత్త ఎలంట్రా ఎన్ సెడాన్‌ను విడుదల చేసింది. ఈ కారును దక్షిణ కొరియాలో ‘అవంటే ఎన్’, ఆస్ట్రేలియాలో ‘i30 సెడాన్ ఎన్’గా విక్రయించనున్నారు. ఎన్ సిరీస్ వాహనాల అభిమానుల కోసం హ్యుందాయ్ ఎలంట్రా ఎన్‌కు సంబంధించిన ప్రత్యేక ట్రైలర్‌ను కూడా ప్రదర్శించింది.

డిజైన్ ఎలా ఉంది?
కొత్త ఎలంట్రా ఎన్‌లో ఒక ప్రత్యేక డిజైన్ అప్‌డేట్ అందించారు. ఇందులో విశాలమైన ఫ్రంట్, ‘ఎన్’ బ్యాడ్జ్‌తో అప్‌డేట్ చేసిన గ్రిల్, సైడ్ సిల్స్, రియర్ స్పాయిలర్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ ఉన్నాయి. అలాగే ఇందులో అందించిన కొత్త హెడ్‌లైట్లు స్మూత్‌గా ఉంటాయి.

ఇంటీరియర్ డిజైన్ ఇలా?
ఇక ఇంటీరియర్ గురించి చెప్పాలంటే కొత్త ఎలంట్రా ఎన్‌లో స్పోర్టియర్ బకెట్ సీట్లు, 4.2 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బోస్ స్పీకర్‌లతో కూడిన 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా అందించారు.

హ్యుందాయ్ కొత్త ఎలంట్రా ఎన్ హ్యాండ్లింగ్‌ను మెరుగుపరచడానికి అనేక మార్పులు చేసింది. ఇందులో ఇంజన్ మౌంట్‌లను బలోపేతం చేయడం, సస్పెన్షన్, ఈఎస్సీ మార్పులు, మెరుగైన స్టీరింగ్ రిఫైన్‌మెంట్ కోసం తగ్గిన జాయింట్ ఫ్రిక్షన్, కొత్త స్టీరింగ్ గేర్ యోక్ ఉన్నాయి. బ్యాలెన్సింగ్ కోసం కొత్త టైర్ ప్రెజర్ యాక్సిల్ కూడా చేర్చారు.

ఇంజిన్ ఎలా ఉంది?
కొత్త ‘ఎలంట్రా ఎన్’కి శక్తిని ఇవ్వడానికి, 2.0 లీటర్ జీడీఐ టర్బోఛార్జ్‌డ్ ఇంజిన్ ఉపయోగించబడింది. దీన్ని ఎన్ సిరీస్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఇంజిన్ 276 బీహెచ్‌పీ పవర్, 392 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 8 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో రానుంది. కొత్త ఎలంట్రా ఎన్ గరిష్ట వేగం గంటకు 280 కిలోమీటర్లుగా ఉంది. ఇది టయోటా జీఆర్ కరోలా, ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ ఆర్‌లతో పోటీపడుతుంది.

మరోవైపు హీరో మోటోకార్ప్ తన కరిజ్మా ఎక్స్ఎంఆర్‌కు సంబంధించిన యూనిట్లను డెలివరీలకు సిద్ధం చేస్తుంది. ఈ బైక్‌కు సంబంధించిన మొదటి యూనిట్ జైపూర్ లొకేషన్ నుంచి బయటకు రానుందని తెలుస్తోంది. మరికొన్ని వారాల్లో హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్‌కు సంబంధించిన డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వినియోగదారులు రూ.3000 కట్టి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్‌లో 210 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఈ బైక్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో లాంచ్ చేశారు. హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్‌ 25.5 బీహెచ్‌పీ పవర్, 20.4 ఎన్ఎం టార్క్‌ని అందించగలదు.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficialSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *