ఫ్లాట్‌గా ఓపెన్‌ అయిన సెన్సెక్స్‌, నిఫ్టీ – చేదెక్కిన ఫార్మా, దూసుకెళ్తున్న ఆటో

[ad_1]

Stock Market Today News in Telugu: నిన్న (బుధవారం) స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఫార్మా షేర్లు పతనమయ్యాయి, ఆటో షేర్లు పెరిగాయి. మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్స్‌ ర్యాలీ నుంచి మార్కెట్‌కు మద్దతు లభిస్తోంది. 

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
నిన్న (బుధవారం, 22 నవంబర్‌ 2023) 66,023 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 61 పాయింట్లు పెరిగి 66,084 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గత సెషన్‌లో 19,812 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 16 పాయింట్లు లేదా 0.08% పెరిగి 19,828 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. నిఫ్టీ బ్యాంక్‌ 3 పాయింట్లు పెరిగి 43,452.75 స్థాయి దగ్గర స్టార్ట్‌ అయింది.

ఈ రోజు మార్కెట్‌ ప్రారంభంలో.. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లోని సుమారుగా 1,517 షేర్లు గ్రీన్‌ మార్క్‌లో ఉన్నాయి, 469 షేర్లు రెడ్‌ మార్క్‌లో కనిపించాయి. 114 షేర్లలో ఎలాంటి మార్పు మారలేదు. 

నిఫ్టీ గెయినర్స్‌లో.. బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి. బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్ షేర్లు ఈ రోజు కొత్త 52-వారాల గరిష్టాలను తాకాయి.

నిఫ్టీ లూజర్స్‌ లిస్ట్‌లో… సిప్లా, HUL, SBI లైఫ్ ఇన్సూరెన్స్, మారుతీ సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు చేరాయి. 

ఈ రోజు ఓపెనింగ్‌ ట్రేడ్‌లో నిఫ్టీ బ్యాంక్‌లో మంచి హుషారు కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలోని మొత్తం 12 బ్యాంకింగ్ స్టాక్స్ గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. మిగిలిన సెక్టోరియల్‌ ఇండెక్స్‌లు కూడా హయ్యర్‌ సైడ్‌లో ప్రారంభమయ్యాయి. 

ప్రి-ఓపెన్ సమయంలో, S&P BSE సెన్సెక్స్ ఇండెక్స్ 60.04 పాయింట్లు లేదా 0.09% పెరిగి 66,083.28 వద్ద ఉండగా, NSE నిఫ్టీ50 16.60 పాయింట్లు లేదా 0.08% పెరిగి 19,828.45 వద్ద ఉంది.

ఉదయం 10.15 గంటల సమయానికి, సెన్సెక్స్ 121.33 పాయింట్లు లేదా 0.18% పెరిగి 66,144.57 వద్ద; నిఫ్టీ 32.90 పాయింట్లు లేదా 0.17% పెరిగి 19,844.75 వద్ద ట్రేడవుతున్నాయి.

FII, DII డేటా
NSEలో అందుబాటులో ఉన్న తాత్కాలిక డేటా ప్రకారం, నిన్న, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FII) నికరంగా రూ. 306.56 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదార్లు (DII) నికరంగా రూ. 721.24 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.

గ్లోబల్‌ మార్కెట్స్‌
US ఆర్థిక వ్యవస్థ స్థిమితపడుతోందని, మాంద్యాన్ని నివారించేందుకు తగినంత బలంగా ఉండవచ్చని అక్కడి ఆర్థిక డేటా సూచించాయి. దీంతో, ఫెడ్ రేట్ల పెంపు ఇక సమాప్తమయిందన్న ఆశతో నిన్న (బుధవారం) US మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే.. ఈ రోజు ఓపెనింగ్‌ ట్రేడ్‌లో నికాయ్‌, కోస్పి, తైవాన్ 0.1% – 0.3% శాతం లాభపడగా, హాంగ్ సెంగ్, షాంఘై సూచీలు 0.7 శాతం వరకు పడిపోయాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవే

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *