PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మందులు వాడేప్పుడు.. ఈ నియమాలు కచ్చితంగా పాటించాలి..!

[ad_1]

Safe Way To Take Medicine: ఈ రోజుల్లో చాలామందికి మందులు వాడనిదే రోజు గడవదు. కొంతమంది ప్రతిపూట ఏదో ఒక మెడిసిన్‌ వాడుతూ ఉంటారు. ఔషధాలు మన వ్యాధిని మూలం నుంచి నిర్మూలించడానికి సహాయపడతాయి. కానీ, కొంతమంది, మందులు వేసుకున్నా కోలుకోరు, ఆ మందులు పనికిరావడం లేదని కంప్లైంట్‌ చేస్తూ ఉంటారు. అయితే, మనం చేసే కొన్ని తప్పుల కారణంగా.. మెడిసిన్‌ ఎఫెక్ట్‌ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్‌ మనకు ప్రిస్క్రిప్షన్‌ రాసేప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా చెబుతూ ఉంటారు. వాటని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మెడిసిన్‌ తీసుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని డాక్టర్ రాజీవ్ పారిఖ్ అన్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం. (Dr. Rajeev Parikh, Chairman, Vascular Surgery, Medanta- The Medicity)

టైమ్‌ ప్రకారం మెడిసిన్‌ తీసుకోవాలి..

టైమ్‌ ప్రకారం మెడిసిన్‌ తీసుకోవాలి..

డైలీ వేసుకునే మందులు.. నిర్దేశించిన సమయానికి కచ్చితంగా తీసుకోవాలని డాక్టర్‌ రాజీవ్‌ సూచిస్తున్నారు. పావుగంట, అరగంట సమయం దాటినా పర్వాలేదని… గంట కంటే ఎక్కువ గ్యాప్‌ ఇవ్వడం మంచిది కాదని అంటున్నారు. ఈ పొరపాటు వల్ల శరీరంలో ఔషధాల స్థాయి మారి మళ్లీ వ్యాధి మూలాలు బయటపడడం మొదలవుతాయి. (image source – pixabay)

ఎప్పుడు వేసుకోవాలో తెలుసుకోండి..

ఎప్పుడు వేసుకోవాలో తెలుసుకోండి..

కొన్ని మందులు ఖాళీ కడుపుతో తీసుకోవాలి, కొన్ని ఆహారం తిన్న తర్వాత వేసుకోవాలి. మీ మెడిసిన్‌ ఎప్పుడు వేసుకోవాలో తెలుసుకోండి, ఈ విషయం డాక్టర్స్‌ మీకు చెబుతారు. చాలా మందులు ఖాళీ కడుపుతో మాత్రమే శరీరంలో వాటి ప్రభావం చూపిస్తాయి. కొన్ని మందులు పనిచేయాడనికి ఆహారం అవసరం.

(image source – pixabay)

కోర్స్‌ పూర్తి చేయండి..

కోర్స్‌ పూర్తి చేయండి..

మీరు ఏదైనా వ్యాధికి మందులు వాడుతున్నప్పుడు, దాని కోర్సును పూర్తి చేయండి. చాలా మంది అనారోగ్యం తగ్గగానే.. మధ్యలోనే మందులు తీసుకోవడం మానేస్తుంటారు. ఇలా చేస్తే.. మీ వ్యాధిని మూలం నుంచి నిర్మూలించలేం. సరైన వ్యవధిలో సరైన సమయంలో సరైన పరిమాణంలో ఔషధాన్ని తీసుకోవడం అవసరం.

(image source – pixabay)​

Health Care: ఈ 6 అలవాట్లు ఉంటే.. మిమ్మల్ని రోగాలు రౌండప్‌ చేస్తాయ్‌..!

డాక్టర్‌ సూచన మేరకే మెడిసిన్‌ తీసుకోండి..

డాక్టర్‌ సూచన మేరకే మెడిసిన్‌ తీసుకోండి..

చాలా మంది అనారోగ్యం వస్తే.. డాక్టర్‌ను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకుంటూ ఉంటారు లేదా డ్రగిస్ట్‌ సలహా మేరకు మందులు వాడుతూ ఉంటారు. కానీ, మెడిసిన్‌ డాక్టర్‌ సలహా మేరకే వాడాలి. కొన్ని మందులు తీవ్రమైన దుష్ప్రభావాలను చూపుతాయి. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.

(image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *