PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మళ్లీ అదరగొట్టిన చిన్న కంపెనీలు – వారంలో రెండంకెల లాభం తెచ్చిన 46 స్మాల్‌ క్యాప్స్‌

[ad_1]

Stock Market News in Telugu: ఈ వారంలో స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అయ్యాయి, ఒక రేంజ్‌ బౌండ్‌లోనే షటిల్‌ చేశాయి. వారం మొత్తంలో, BSE బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ నికరంగా 0.3% లాభంతో 65970 పాయింట్ల వద్ద స్థిరపడింది. S&P BSE స్మాల్‌ క్యాప్ ఇండెక్స్ 0.5% పెరిగింది. 

గత కొన్నాళ్లుగా లార్జ్‌ క్యాప్స్‌ను మించి పెరుగుతున్న స్మాల్‌ & మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఈ వారంలోనూ అదే జోరు చూపించాయి. BSE స్మాల్‌ క్యాప్ స్పేస్‌లో… 46 చిన్న షేర్లు దీపావళి తారాజువ్వల్లా దూసుకెళ్లాయి. ఈ ఐదు రోజుల్లోనే (సోమవారం-శుక్రవారం) 31% వరకు ర్యాలీ చేసి రెండంకెల లాభాలను ఇన్వెస్టర్లకు అందించాయి. ఈ 46 స్మాల్‌ క్యాప్స్‌లో… 29 స్టాక్స్‌ కొత్త 52-వారాల గరిష్ట స్థాయికి కూడా చేరుకున్నాయి.

ఈ వారంలో 31% వరకు ర్యాలీ చేసిన స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌:

టాల్‌బ్రోస్ ఆటోమోటివ్ ——- 31% రిటర్న్స్‌
మ్యాన్ ఇన్‌ఫ్రాకన్‌స్ట్రక్షన్ ——- 29% లాభం
3I ఇన్ఫోటెక్ ——————- 28% గెయిన్స్‌
సీక్వెంట్ సైంటిఫిక్ ————- 26% ప్రాఫిట్‌
63 మూన్స్ టెక్నాలజీస్ ——- 22% వృద్ధి
ప్రతాప్ స్నాక్స్ —————– 21% జంప్‌
ఇన్‌సెక్టిసైడ్స్‌ (ఇండియా) —– 16% ర్యాలీ
ఆనంద్ రాఠీ వెల్త్‌ ————— 15% పెరుగుదల
IFGL రిఫ్రాక్టరీస్ —————- 15% అప్‌సైడ్‌
స్పైస్‌జెట్ ———————- 14% అప్‌మూవ్‌

ఫార్మా సెక్టార్‌ మీద పాజిటివ్‌ ఔట్‌లుక్‌, ఆకర్షణీయమైన వాల్యుయేషన్స్‌ వల్ల చాలా ఔషధ షేర్లు మార్కెట్‌ ఫేవరేట్స్ జాబితాలో చేరాయి. మార్కెట్‌ ఎనలిస్ట్‌లు చెబుతున్న ప్రకారం, US జెనరిక్ మార్కెట్‌లో ధరల ఒత్తిడి తగ్గుతోంది. దీనివల్ల, ఇండియన్ ఫార్మా కంపెనీల ఆదాయాలు మెరుగుపడతాయి. ఫార్మా కౌంటర్ల మీద సెంటిమెంట్‌ మెరుగుపడడానికి ఇదే కారణం.

ఫార్మాతో పాటు రియల్టీ స్టాక్స్ కూడా గత వారంలో బాగానే పెర్‌ఫార్మ్‌ చేశాయి. సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో… నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ టాప్ గెయినర్‌గా ఉంది, వారంలో 1.5% పెరిగింది. ఈ రంగంలో…  ఫీనిక్స్ మిల్స్, ఒబెరాయ్ రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్‌ 3-5% రేంజ్‌లో వీక్లీ గెయిన్స్‌ ఇచ్చాయి.

మిడ్‌ క్యాప్ స్టాక్స్‌లోనూ హుషారు
వారం వారీ ప్రాతిపదికన… S&P BSE స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌తో పాటు మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ కూడా గెయిన్‌ అయింది, 0.7% లాభపడింది. మిడ్‌ క్యాప్ గెయినర్స్‌ లిస్ట్‌లో ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు టాప్‌ ప్లేసుల్లో ఉన్నాయి.  లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా (LIC), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్ వారంలో 10-38% వరకు లాభపడ్డాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరో ఆసక్తికర కథనం: స్టాక్‌ మార్కెట్‌కు సోమవారం కూడా సెలవే – 3 రోజుల తర్వాతే ట్రేడింగ్‌ ప్రారంభం

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *