మాట్లాడడంలో ఇబ్బందిగా ఉంటే ఈ సమస్య ఉన్నట్లే..

[ad_1]

పార్కిన్సన్స్ అనేది న్యూరోడెజెనరేటివ్ సమస్య. ఈ సమస్య వచ్చినప్పుడు నరాల సాయంతో పనిచేసే బ్రెయిన్ ఇబ్బందికి గురవుతుంది. పేషెంట్స్‌ని అనేక రకాలుగా దెబ్బతీసే ఈ సమస్య అసలు ఏ కారణాలతో వస్తుందనేది చెప్పడం ఇప్పటికీ కష్టమే. ఇది వచ్చిన వారు మిగతావారితో పోలిస్తే సరిగ్గా నడవలేరు, జీవించలేరు. వారి జీవమనే పూర్తిగా మారిపోతుంది. అసలు ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎన్ని రకాలుగా ఉంటుందంటే..

ఎన్ని రకాలుగా ఉంటుందంటే..

నరాల సమస్యలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అందులో పార్కిన్సన్స్ కూడా ఒకటి. ఈ సమస్య వచ్చిన వారిలో వణుకు, బాడీ బిగుతుగా మారడం వంటి అనేక కదలికలకి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితి వచ్చిన వారిలో ఎన్నో అసాధారణ లక్షణాలు కనిపించి ఇబ్బందులకి గురవుతారు. అందుకే ఈ సమస్యపై ముందు నుంచీ ప్రతి ఒక్కరూ కచ్చితమైన విషయాలు తెలుసుకోవాలి.

Also Read : Soursop : ఈ పండు తింటే బరువు తగ్గడమే కాదు.. క్యాన్సర్స్ దూరం..

ఈ సమస్య ఎన్ని రకాలుగా ఉంటుందంటే..

ఈ సమస్య ఎన్ని రకాలుగా ఉంటుందంటే..

ఇడియోపతిక్ పార్కిన్సన్స్
వాస్కులర్ పార్కిన్సోనిజం
డ్రగ్ ప్రేరిత పార్కిన్సోనిజం
ఎర్లీ ఆన్సెట్ పార్కిన్సన్స్
ప్రోగ్రెసివ్ సూపర్ న్యూక్లియర్ పాల్సీ

ఇలా చాలా రకాలుగా ఉంటుంది సమస్య.

కారణాలు..

కారణాలు..

పార్కిన్సన్స్ వ్యాధి రావడానికి మెదడులో మార్పులు. దీనికి కచ్చితమైన కారణమంటూ ఏం లేదు. నిపుణుల ప్రకారం.. జన్యుశాస్త్రం, పర్యావరణం ముఖ్య కారకాలు. అదే విధంగా, 60 అంతకంటే ఎక్కువ వయసులో ఈ సమస్య వస్తుంది. ఆల్ఫా, సిన్యూక్లిన్ జన్యువులోని జన్యు ఉత్పరివర్తనలు కూడా కారణమవ్వొచ్చనొ తెలుస్తోంది. వీటితో పాటు మాంగనీస్ వంటి విషపదార్థాలకు గురవ్వడం కూడా పార్కిన్సన్స్ రావడానికి కారణాలుగా అనుమానిస్తూ పరిశోధనలు కొనసాగుతున్నాయి.

కుటుంబచరిత్ర, తలకు తీవ్రమైన దెబ్బ తాకడం, లింగం, తీసుకునే మెడిసిన్స్, టాక్సిన్ ఎక్స్‌పోజర్ కూడా కారణమే.

లక్షణాలు..

లక్షణాలు..

ఈ వ్యాధి లక్షణాలు చూస్తే.. మాట్లాడే మాటల్లో తేడా గమనించొచ్చని లిథువేనియన్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ పరిశోధకుడు రైటిస్ మాస్కెలినాస్, అతని బృందం చెబుతున్నారు. మరో ప్రొఫెసర్ విర్గిలిజస్ ఉలోజాస్.. సమస్య ప్రారంభమైనప్పుడు కొంతమంది మెల్లిగా మాట్లాడతారు. వారు గొంతు మారుతుందని చెబుతున్నారు. వీటితో పాటు..

చేతిలో వణుకు
బాడీ స్టిఫ్‌గా మారడం
కదలికల్లో మార్పు
వాసన గ్రహించలేకపోవడం
నడక మారడం
ముందుకు వంగినట్లుగా మారడం
ముఖ కండరాల్లో వచ్చే మార్పులో ముఖంలో మార్పు
గొంతులో వణుకు, బలహీనంగా మాట్లాడడం
అప్పటి వరకూ చేతితో రాసిన వారు రాయలేకపోవడం
నిద్రలేకపోవడం
డిప్రెషన్
మూడ్ చేంజెస్
నమలడం, మింగడంలో తేడా
అలసట
మలబద్ధకం
చర్మ సమస్యలు ఇలా మరెన్నో లక్షణాలు ఉంటాయి

నిర్ధారణ..

నిర్ధారణ..

ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించడం ఇబ్బందే. సమన్వయం, కండరాల బలం, మానసిక పనితీరులో మార్పులని గమనించేందుకు శారీరక, నాడీ సంబంధిత పరీక్షలు అవసరమవుతాయి.

రక్తపరీక్షలు.. వీటి ద్వారా నిర్ధారణ జరగనప్పటికీ, సమస్య ప్రత్యామ్నాయ కారణాలను గుర్తించేందుకు డాక్టర్స్‌కి ఇవి అవసరం
జన్యు పరీక్ష
డాట్సాన్
ఎమ్ఆర్ఐ

ఎవరైనా వణుకుతున్నట్లు, కండరాలు బిగుతుగా మారి కదల్లేక పోతే వెంటనే వారు డాక్టర్‌ని సంప్రదించాలి. డాక్టర్స్ అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. న్యూరాలజిస్ట్‌లు వారిని పరీక్షిస్తారు. ఇందులో భాగంగా పేషెంట్స్‌ని మెరుగ్గా పరిశీలించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడుతున్నారు. దీనివల్ల సరిగ్గా, క్షణాల్లోనే సమస్యని గుర్తించొచ్చని వారు చెబుతున్నారు.
Also Read : Antibiotics : యాంటీ బయాటిక్స్ వాడుతున్నారా.. వీటిని మరిచిపోవద్దు..

ట్రీట్‌మెంట్..

ట్రీట్‌మెంట్..

ఈ వ్యాధికి ట్రీట్‌మెంట్ లేదు. అయితే, కొన్ని మెడిసిన్స్ లక్షణాలను తగ్గించడంలో సాయపడతాయి.

కొన్నిసార్లు మెడిసిన్ అవసరమైతే.. మరికొన్ని సార్లు ఫిజికల్ థెరపీ అవసరమవుతుంది. పేషెంట్ కండీషన్‌ని బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తారు.

ఎలాంటి జాగ్రత్తలు..

ఎలాంటి జాగ్రత్తలు..

మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వర్కౌట్ చేయడం మంచిది. పాజిటీవ్‌గా ఆలోచించాలి. అదే విధంగా వాకింగ్ స్టిక్ వాడాలి. వేడి, చల్లని ఆహారాన్ని ఒకేసారి తీసుకోవద్దు. ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిది నెగటీవ్‌గా ఆలోచించకుండా.. ఒంటరిగా ఉండకుండా అందరితో కలసిపోవాలి. షుగర్ ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవడం,. ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *