PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మార్కెట్‌ నమ్మకాన్ని కోల్పోయిన 10 బడా కంపెనీలు, ఈ స్టాక్స్‌ మీ దగ్గర ఉంటే జాగ్రత్త సుమా!

[ad_1]

Stock Market: గత నెల రోజుల్లో కొన్ని షేర్లకు టార్గెట్ ధరలను బ్రోకరేజీలు తగ్గించాయి. కట్స్‌ పడ్డ లిస్ట్‌లో చాలా పెద్ద కంపెనీల పేర్లు ఉన్నాయి. ఆయా సంస్థల ఆదాయాలు తగ్గే సూచనలు కనిపించడం, మేనేజ్‌మెంట్‌ పరమైన సమస్యలు వంటివి ఇందుకు కారణాలు. గత నెల రోజుల్లో కనీసం ఇద్దరు ఎనలిస్ట్‌లు ఆయా కంపెనీ షేర్లకు టార్గెట్ ప్రైస్‌లు తగ్గించారు. 

టార్గెట్‌ ప్రైస్‌లు కట్‌ చేసినా ఆయా స్టాక్స్‌లో మరికొంత ర్యాలీకి అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ, ఆ కంపెనీల మీద మార్కెట్‌ ఎనలిస్ట్‌లకు నమ్మకం తగ్గిందన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవడం మంచిది.

టార్గెట్ ధరల్లో కోత పడిన 10 స్టాక్స్‌:

సిటీ యూనియన్ బ్యాంక్  |  ప్రస్తుత మార్కెట్ ధర: రూ 127
సిటీ యూనియన్ బ్యాంక్‌ షేర్ల టార్గెట్ ధరను నాలుగు బ్రోకింగ్‌ కంపెనీలు తగ్గించాయి. ఎనలిస్ట్‌లు ఇచ్చిన సగటు టార్గెట్ ప్రైస్‌ రూ. 157. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 23% అప్‌సైడ్‌ను ఇది సూచిస్తోంది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.9,436 కోట్లు.

KNR కన్‌స్ట్రక్షన్  |  ప్రస్తుత మార్కెట్ ధర: రూ 275
ముగ్గురు ఎనలిస్ట్‌లు KNR కన్‌స్ట్రక్షన్‌పై టార్గెట్ ధరలో కోత పెట్టారు, సగటు టార్గెట్ ప్రైస్‌ను రూ. 289గా నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి దాదాపు 5% అప్‌సైడ్‌ ఉండొచ్చని చెబుతున్నారు. KNR కన్‌స్ట్రక్షన్‌ మార్కెట్ విలువ రూ.7,745 కోట్లు.

ఆర్తి ఇండస్ట్రీస్  |  ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 500
ఆర్తి ఇండస్ట్రీస్ టార్గెట్ ధరను ముగ్గురు ఎనలిస్ట్‌లు కట్‌ చేశారు, సగటు టార్గెట్ ప్రైస్‌ను రూ. 486గా నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి దాదాపు 3% తగ్గుదలను ఇది చూపుతోంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.18,110 కోట్లు.

అదానీ విల్మార్  |  ప్రస్తుత మార్కెట్ ధర: రూ 352
అదానీ విల్మార్‌పై ఇద్దరు ఎనలిస్ట్‌లు టార్గెట్ ధరను కుదించారు, సగటు టార్గెట్ ప్రైస్‌ను రూ. 445గా నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి దాదాపు 27% అప్‌సైడ్‌ను ఇది సూచిస్తోంది. అదానీ విల్మార్ మార్కెట్ క్యాప్ రూ.45,729 కోట్లు.

హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్  |  ప్రస్తుత మార్కెట్ ధర: రూ 916
ఇద్దరు ఎనలిస్ట్‌లు హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ ధర లక్ష్యాన్ని తగ్గించారు, సగటు టార్గెట్ ప్రైస్‌ను రూ. 1,070గా నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 17% ర్యాలీని ఇది సూచిస్తుంది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.13,957 కోట్లు.

మెట్రోపొలిస్ హెల్త్‌కేర్  |  ప్రస్తుత మార్కెట్ ధర: రూ 1,378
ఈ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరలో కోత పెట్టి ఇద్దరు బ్రోకర్లు, సగటు టార్గెట్ ప్రైస్‌ను రూ. 1,398గా నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 1% అప్‌సైడ్ అవకాశం ఉందని ఈ టార్గెట్‌ ధర అర్ధం. దీని మార్కెట్ క్యాప్ రూ.7,060 కోట్లు.

CG కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్  |  ప్రస్తుత మార్కెట్ ధర: రూ 304
ఇద్దరు ఎనలిస్ట్‌లు CG కన్స్యూమర్ టార్గెట్ ధరను తగ్గించారు, సగటు టార్గెట్ ప్రైస్‌ను రూ. 335గా నిర్ణయించారు. ఇది ప్రస్తుత మార్కెట్ ధర నుంచి దాదాపు 10% పెరుగుదలను సూచిస్తోంది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.19,442 కోట్లు.

ఓల్టాస్  |  ప్రస్తుత మార్కెట్ ధర: రూ 866
ఓల్టాస్‌లో టార్గెట్ ధరను ఇద్దరు ఎనలిస్ట్‌లు కట్‌ చేశారు, సగటు టార్గెట్ ప్రైస్‌ను రూ. 881గా నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి దాదాపు 2% వృద్ధిని ఈ టార్గెట్‌ ధర చూపిస్తోంది. ఓల్టాస్ మార్కెట్ క్యాప్ రూ.28,663 కోట్లు.

వినతి ఆర్గానిక్స్  |  ప్రస్తుత మార్కెట్ ధర: రూ 1,870
ఈ స్టాక్ టార్గెట్ ధరను ఇద్దరు ఎనలిస్ట్‌లు కుదించారు, సగటు టార్గెట్ ప్రైస్‌ను రూ. 1,880గా నిర్ణయించారు. ఇది ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 1% పెరుగుదలను సూచిస్తోంది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.19,040 కోట్లు.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్  |  ప్రస్తుత మార్కెట్ ధర: రూ 219
ఇద్దరు ఎనలిస్ట్‌లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్‌పై టార్గెట్ ధరను తగ్గించారు, సగటు టార్గెట్ ప్రైస్‌ను రూ. 228గా నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 4% అప్‌సైడ్‌కు ఇది గుర్తు. దీని మార్కెట్ క్యాప్ రూ.20,840 కోట్లు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: నిఫ్టీ, సెన్సెక్స్‌ పెరగట్లేదు, అయినా ఇన్వెస్టర్లు డబ్బులెలా సంపాదిస్తున్నారబ్బా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *