News
oi-Mamidi Ayyappa
Crude
Imports:
ప్రపంచంలో
అత్యధిక
జనాభా
కలిగిన
భారత్
తన
ఇంధన
అవసరాల
కోసం
అత్యధికంగా
దిగుమతులపైనే
అధారపడుతోంది.
ఈ
క్రమంలో
విలువైన
విదేశీ
మారక
నిల్వలను
కాపాడుకోవటం
కోసం
సరసరమైన
ధరలకు
రష్యా
నుంచి
కొనుగోళ్లు
మెుదలెట్టింది.
ఈ
క్రమంలో
భారత్
ఒపెక్
దేశాల
నుంచి
చమురు
దిగుమతులను
భారీగా
తగ్గించిందని
తాజా
గణాంకాలు
చెబుతున్నాయి.
చవకైన
రష్యన్
చమురు
కొనుగోళ్లు
గరిష్ఠ
స్థాయికి
చేరుకోవడంతో
భారతదేశ
చమురు
దిగుమతుల్లో
చమురు
ఉత్పత్తిదారుల
కార్టెల్
ఒపెక్
వాటా
ఏప్రిల్‌లో
ఆల్
టైమ్
కనిష్ఠ
స్థాయి
46
శాతానికి
పడిపోయిందని
పరిశ్రమ
గణాంకాలు
చెబుతున్నాయి.
ఒకప్పుడు
భారతదేశం
దిగుమతి
చేసుకున్న
మొత్తం
ముడి
చమురులో
90
శాతం
వరకు
OPEC
ఉత్పత్తి
చేసినదే
ఉండేది.

భారతదేశం
దిగుమతి
చేసుకున్న
మొత్తం
చమురులో
మూడింట
ఒక
వంతుకు
పైగా
సరఫరా
చేయడం
ద్వారా
వరుసగా
ఏడవ
నెల
కూడా
రిఫైనరీల్లో
పెట్రోలు,
డీజిల్‌గా
మార్చబడిన
ముడి
చమురు
ఏకైక
అతిపెద్ద
సరఫరాదారుగా
రష్యా
కొనసాగింది.
ప్రస్తుతం
భారత్..
రష్యా
నుంచి
దిగుమతి
చేసుకుంటున్న
చమురు
ఇరాక్,
సౌదీ
అరేబియా
నుంచి
సంయుక్త
కొనుగోళ్ల
కంటే
ఎక్కువగా
నిలిచాయి.
అధిక
సరుకు
రవాణా
ఖర్చుల
కారణంగా
గతంలో
భారతీయ
రిఫైనర్‌లు
రష్యన్
చమురును
చాలా
అరుదుగా
కొనుగోలు
చేసేవి.
అయితే..
Vortexa
అందించిన
సమాచారం
ప్రకారం
భారత్
మార్చి
2022లో
రష్యా
నుంచి
కేవలం
68,600
bpd
చమురును
దిగుమతి
చేసుకుంది.
ఈ
సంవత్సరం
కొనుగోళ్లు
1,678,000
bpdకి
పెరిగాయి.
డిసెంబరులో
యూరోపియన్
యూనియన్
దిగుమతులను
నిషేధించిన
తర్వాత
దాని
ఇంధన
ఎగుమతులలో
అంతరాన్ని
పూడ్చేందుకు
రష్యా
భారతదేశానికి
రికార్డు
స్థాయిలో
ముడి
చమురును
విక్రయిస్తోంది.
English summary
Indian crude imports from russia reached peak amid OPEC imports reached all time lows
Indian crude imports from russia reached peak amid OPEC imports reached all time lows
Story first published: Sunday, May 7, 2023, 14:57 [IST]